ఓ చిన్నమాట!

నొప్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందటి మాట. పోలీస్ అకాడమీలో డిప్యుటేషన్ మీద పని చేసిన తరువాత హైదరాబాద్‌లో 17వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పోస్ట్ చేశారు. మూడున్నర సంవత్సరాల తరువాత మళ్లీ మేజిస్ట్రేట్ ఉద్యోగానికి వచ్చాను.
నేను జాయిన్ అయిన నెలలోనే మరణ వాంగ్మూలాలు నమోదు చేసే డ్యూటీ నాకు పడింది. నెలకి ఇద్దరు మేజిస్ట్రేట్‌లకి ఆ డ్యూటీ ఉంటుంది. సికిందరాబాద్ ప్రాంతానికి ఒకరు. హైదరాబాద్‌కి ఒకరు. హైదరాబాద్ ప్రాంతంలో మరణ వాంగ్మూలాలు నమోదు చేసే డ్యూటీ నాది. ఒక్కోరోజు కనీసం పది నుంచి పదిహేను మంది మరణ వాంగ్మూలాలు నమోదు చేసేవాణ్ని. ఎక్కువగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో నమోదు చేసేవాణ్ని. రెండవ ఫ్లోర్, మూడవ ఫ్లోర్ సునాయాసంగా ఎక్కేవాడిని. నెల చివరి వరకు మోకాలు నొప్పులు వచ్చాయి.
డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన పరీక్ష చేసి అరుగుదల మొదలైందని చెప్పి కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చెప్పాడు, కొన్ని మందులూ ఇచ్చాడు. కొంతకాలం తరువాత నొప్పి తగ్గింది.
ఆ సంవత్సరమంతా జాగ్రత్తలు తీసుకున్నాను. క్రింద కూర్చోవడం కాస్త తగ్గించాను. వెస్ట్రన్ కమోడ్ వాడటం మొదలుపెట్టాను. ఎక్కువ మెట్లు ఎక్కడం తగ్గించాను. నొప్పులు తగ్గాయి. మందులు వాడటం మానేశాను. ఆ తరువాత మామూలుగా అయిపొయ్యాను.
మరీ ఎక్కువ మెట్లెక్కినప్పుడు మాత్రం మోకాలు నొప్పులు వస్తున్నాయి. అంతే కానీ తరచుగా కాదు. నొప్పిని తగ్గించుకోవడం కోసం ఆపరేషన్ చేయించుకోలేదు. జాగ్రత్తగా ఉండటం వల్ల నొప్పిని వాయిదా పడింది.
అన్ని నొప్పులని కాస్త వాయిదా వేస్తూ వుండాలి.
ఈ విషయం అన్నింటికీ వర్తిస్తుంది.
కొన్నిసార్లు బాధ తప్పనిసరి అవుతుంది.
దాన్ని భరించాల్సిందే.
తొలగించుకోవడం సాధ్యం కానప్పుడు, కాలాన్ని వృథా చేయడం అనవసరం.
ఆ నొప్పిని వాయిదా వేసే పద్ధతిని మన అనుభవం ప్రకారం మనం కనుగొనాలి.
అంతే!