ఓ చిన్నమాట!
విషమ పరిస్థితి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విషమ పరిస్థితి ఉన్నప్పుడు పరిస్థితులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఊహించని విధమైన తెగింపు. రెండవది నిస్సహాయత.
విషమ పరిస్థితుల్లో తెగింపు ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకోవడానికి మన ప్రయత్నం మనం చాలా గట్టిగా చేయాలి. ఫలితం ఏమైనా పర్వాలేదు.
నిస్సహాయ పరిస్థితుల్లో పరిస్థితులకి సరెండర్ కావడం అంటే ప్రయత్నం చేయకుండానే ఓడిపోవడం లాంటిది. ఇలాంటి రెండు ఏళ్ల నుండి ఎన్నో ఉదాహరణలని చెప్పవచ్చు. మనుషుల కన్నా పశుపక్ష్యాదులు ఎలా ఉంటాయో చూద్దాం.
తన వెంట పడుతున్న నక్క నుంచి తప్పించుకోవడానికి తన శక్తికి మించి పరుగెత్తుతుంది కుందేలు. మామూలు పరిస్థితుల్లో అతివేగంగా పరిగెత్తలేదు. కానీ విషమ పరిస్థితుల్లో దాని వేగం రెట్టింపుకు మించి ఉంటుంది.
ఆకలితో ఉన్న సింహం తాను వేటాడాల్సిన ప్రాణి కోసం అవాంతరాలను లెక్కపెట్టకుండా అడవి అంతా వెతుకుతుంది.
ఆల్బాట్రాస్ అనే సముద్ర పక్షి తన ఆహారం కోసం రోజులు, వారాలు, నెలలుగా ఆకాశంలో విహరిస్తుంది.
రక్కూన్ అనే కుక్క జాతికి చెందిన జంతువు తన కుటుంబాన్ని ఆహారం కోసం ఎన్నో ప్రాంతాలు వెతుకుతుంది.
పిల్లలతో ఉన్న కోడి తన కోడి పిల్లలను రక్షించుకోవడానికి గద్దతోని యుద్ధం చేస్తుంది.
ఏమీ చేయలేమని నిరాశగా ఉంటే ఫలితం లేదు.
విషమ పరిస్థితుల్లో మన శక్తినంతా కూడదీసుకుని పోరాటం చేయాల్సిందే.
జీవితంలో ప్రతి ఒక్కరికి విషమ పరిస్థితులు వస్తాయి. అప్పుడే తెలుస్తుంది మన శక్తి సామర్థ్యాలు.
విషమ పరిస్థితుల్లో సాధించాలన్న పట్టుదల ఉండాలి.