S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గంగిరెద్దు

సంక్రాంతి సమయంలోనే గంగిరెద్దులు కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే రేణగాయలు కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే ముగ్గులు ఎక్కువగా కన్పించేవి.
సంక్రాంతి సమయంలోనే గొబ్బెమ్మలు కన్పించేవి.
ఎద్దుని ఎంతో అందంగా అలంకరించి తీసుకొని వచ్చేవాళ్లు గంగిరెద్దుల వాళ్లు. వాళ్ల పాటకు గంగిరెద్దు నాట్యం చేసేది. నమస్కారం చేయమంటే చేసేది.
రేణిగాయలు అంటే గుర్తుకొచ్చింది. రేణికాయల్లో చాలా రకాలు ఉండేవి. పెద్ద రేగుపండ్లు. ఇవి మామూలుగా బజారులో అమ్మేవాళ్లు. ఇవి కాకుండా మరో రేణికాయలు. ఇవి చాలా చిన్నగా వుండేవి. పొలాల చుట్టు వీటిని పెంచేవాళ్లు. పశువులని నియంత్రించడానికి వీటిని పెంచేవాళ్లు. పశువులని నియంత్రించేవి. కానీ పిల్లల్ని ఆకర్షించేవి. చిన్న రేణిగాయలని తెంపుకోవడానికి పిల్లలం అందరం పొలాల దగ్గరికి, చేను దగ్గరికి వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద రేగుపండ్లు వున్నా, ఈ రేగుపండ్లు ఇచ్చే మజానే వేరు. ముళ్లు గిచ్చుకొని తెచ్చుకున్న రేగుపండ్లు రుచే వేరు.
ముగ్గుల సంగతి చెప్పాల్సిన పనిలేదు.
ముగ్గులని గొబ్బెమ్మలని తొక్కకుండా ఇంట్లోకి వెళ్లడం గగనంగా వుండేది.
అపార్ట్‌మెంట్లలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కోల్పోయాం.
కాలం ఎన్ని మార్పులని తెస్తుంది.
అట్లాగే వుండాలని అనుకోవడం
ఎంత మాత్రం సరైంది కాదు.
మార్పులని ఆహ్వానించాలి.
మార్పులకి తగినట్టుగా మారకపోతే జీవన ప్రయాం సుఖంగా జరగదు.