ఓ చిన్నమాట!

గరమ్ చాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం పూట నడవడం అలవాటై పోయింది. ఆ తరువాత అంతా పరుగే.
నడక నాకిష్టం.
ఇది నడవడానికి వీల్లేని రోడ్డు.
ఎక్కడైనా ఇంత బండ్ల బాట వుంటే ఎంత బాగుండు
ఎందుకంటే నడక నాకిష్టం.
అంటాడు ‘కన్నరోడ్డు’ అన్న కవితలో ఓ కవి.
మనిషి రోడ్డు వెంట పడిపోయాడు. ముందు మనిషి నీటి వెంట వుండేవాడు అని మొదలై, ఎక్కడైనా ఇంత బండ్ల బాట వుంటే ఎంత బాగుండు, ఎందుకంటే నడక నాకిష్టం అన్న మాటలతో ముగుస్తుంది.
ఉదయం పూట నడక అందరికీ అవసరం అయిపోయింది. ఎందుకంటే ఆ తరువాత నడవడం లేకుండా పోయింది.
ఉదయం లేచి నడవాలంటే కొంత మందికి కాఫీ పడాలి. నాలాంటి వాడికి గరమ్ చాయ్ పడాలి. గరమ్ చాయ్ పడితే తప్ప నడకకి ఉత్సాహం రాదు.
కప్పు గరమ్ చాయ్‌తోనే ఉత్సాహం వస్తుందా మనస్సులో నడవాలన్న కోరికతో ఉత్సాహం ఉంటుందా?
గరమ్ చాయ్ కానీ, కప్పు కాఫీ గానీ కోరికను ద్విగుణీకృతం చేస్తుందా? కోరిక కలుగజేస్తుందా?
ఈ రెండింటిలో ఏది సత్యం.
గరమ్ చాయ్‌తోనే మనం నడకగానీ ఆ రోజు సాధించాల్సిన విజయాలు, పనులు గానీ ముడిపడి ఉన్నాయా? కానే కాదు.
ఎప్పుడైనా జీవితం విసుగెత్తినప్పుడు, బలమైన కోరికలు లేనప్పుడు గరమ్ చాయ్ గానీ కప్పు కాఫీ గానీ మనల్ని పరిగెత్తిస్తుందా?
నడవాలన్నా, జీవితంలో పరుగెత్తాలన్నా, మనకి కొన్ని లక్ష్యాలు వుండాలి. కొన్ని పనులు సాగించాలన్న బలమైన కోరికలు వుండాలి.
ఇవి వున్నప్పుడు-
కప్పు కాఫీతో పనిలేదు.
గరమ్ చాయ్‌తో పనిలేదు.
నడవాలన్న కోరిక బలంగా వుంటే చాయ్ లేకున్నా పరుగెత్తగలం.

- జింబో 94404 83001