S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

03/19/2017 - 21:54

కొంతమంది నిరంతరాయంగా పని చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలాంటి వ్యాపకం లేకుండా కూర్చుంటూ ఉంటారు.
ఇంటి విషయానికి వస్తే అమ్మ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ నిద్ర లేవకు ముందు లేచి ఆమె పనిచేస్తూ ఉంటుంది. అందరూ పడుకున్న తరువాత ఆమె పని ముగుస్తుంది. ఆమెకు సెలవులు లేవు. ఆదివారాలు లేవు.

03/11/2017 - 21:19

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సమాచారాలు అందజేసుకోవడం చాలా సులువై పోయింది. అదే విధంగా ఏదైనా విషయం మీద మన అభిప్రాయాలు చెప్పడం, వాటిని అంతర్జాలంలో ప్రచురించడం సాంఘిక మాధ్యమాల్లో ఇంకా సులువై పోయింది. ప్రతి విషయంలో మంచీ చెడూ వున్నట్టు వీటి విషయంలో కూడా అంతే.

03/06/2017 - 22:59

ప్రతి వస్తువుని నిశితంగా పరిశీలించాలి. అలా పరిశీలిస్తే మనకు తెలియని విషయాలు ఎన్నో గోచరమవుతాయి. ఆ పరిశీలన దృష్టి వుండాలి.

02/25/2017 - 21:16

ప్రతి విషయంలోనూ ఓ మాట చెప్పడం అవసరం. అలా చెప్పడం వల్ల చాలా అనర్థాలు, అపోహలు రాకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించరు.

02/19/2017 - 02:42

ఈ మధ్యన ఓ విచిత్రమైన కథనాన్ని చదివాను. అందులోని లాజిక్ నన్ను ఆలోచనలో పడేసింది. ఆ లాజిక్ ఎవరినైనా ఆలోచనలో పడేస్తుంది. ఆ కథనం మీకు చెబుతాను.
అమెరికాలోని ఓ రైలు బండిలో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తే బాగా చదువుకున్న వాడిలా వున్నాడు. అధునాతనంగా ఉన్నాడు. అతని చేతిలో బైబిల్ ఉంది. అతను బైబిల్ చదవడంలో నిమగ్నమై వున్నాడు.

02/11/2017 - 21:16

అణుకువతో వుండటం చాలా అవసరం. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక చాలామంది డాంబికం ప్రదర్శిస్తూ వుంటారు. దానివల్ల ఇతరులతో వాళ్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది డాంబికాన్ని వదులుకోరు.

01/28/2017 - 21:18

ఈ మధ్య ఓ మిత్రుడు భోజనానికి పిలిస్తే వాళ్లింటికి భోజనానికి వెళ్లాను. భోజనం కన్నా ముఖ్యమైంది అతనితో కాస్సేపు మాట్లాడుకోవడానికి అవకాశం చిక్కుతుందని వెళ్లాను.

01/22/2017 - 01:24

మాయలు మంత్రాలు వున్న కథలని చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. ఆ కథల్లో మమేకం అవుతారు. మాయలు మంత్రాలు వున్న సినిమాలని ఇంకా ఇష్టపడతారు. వాటిల్లో ప్రధాన పాత్ర మంచితనంతో నిండి ఉంటుంది. ఎన్నో కష్టాలు పడుతుంది. కానీ చివరికి విజయం సాధిస్తుంది. అది రాజుల సినిమా కావొచ్చు. మామూలు వ్యక్తుల సినిమా కావొచ్చు.

01/07/2017 - 22:26

ప్రబుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు చాలామంది ముఖాలు చిట్లిస్తూ కూర్చుంటారు. ఒక్క ఉద్యోగి కూడా చిరునవ్వుతో కనిపించడు. చిరునవ్వుతో కనిపిస్తే వాళ్ల సొమ్ము ఏదో పోయినట్టుగా వుంటారు. కాస్త ఉల్లాసంగా ఉంటే ఎదుటి వ్యక్తులకి ఏదైనా సహాయం చేయాల్సి ఉంటుందేమోనని అన్నట్టుగా వాళ్ల ప్రవర్తన ఉంటుంది. ఇదే పరిస్థితి కూడా బ్యాంకుల్లో కన్పిస్తుంది.

12/31/2016 - 19:42

ఓ మూడు సంవత్సరాల క్రితం గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను చూడాలని ప్లాన్ చేసుకున్నాం. అందులో ముఖ్యమైనవి ద్వారక, సోమ్‌నాథ్‌లు. అది డిసెంబర్ చివరి వారం. అందువల్ల హోటల్స్ దొరకవని చెప్పారు. ద్వారక, సోమ్‌నాథ్‌లలో వున్న న్యాయాధికారులని సంప్రదించాను. ప్రభుత్వ అతిథి గృహాలలో వసతి దొరకడం కష్టమని, మంచి దర్శనం చేయిస్తామని చెప్పారు. మామూలు రోజుల్లో హోటల్స్‌కి వుండే అద్దెకి ఐదింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

Pages