ఓ చిన్నమాట!
చివరి పేజీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కథలు, నవలలు చదివే వాళ్లకి చివరికి ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతురత ఉంటుంది. చాలా మంది మొత్తం పుస్తకం చదవకుండా చివరి పేజీ చదవడానికి ప్రయత్నం చేస్తూంటారు. కొన్నిసార్లు అది చివరి పేజీ కావొచ్చు. మరి కొన్నిసార్లు చివరి అధ్యాయం కావొచ్చు.
సినిమాల విషయంలోనూ అంతే! చివరికి ఏమి జరుగుతుందోనన్న ఆతురత చాలా మందిలో కన్పిస్తుంది. ఈ ఆతురత వల్ల కథలో వుండే సస్పెన్స్ తెలిసి ఉత్సాహం తగ్గిపోతుంది. ఈ విషయం తెలిసీ కూడా చాలా మంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ ఆతురత నవలలు, కథలు, సినిమాల వరకైతే ఫర్వాలేదు. జీవితంలో చివరన ఏమి జరుగుతుందోనన్న ఆతురత ఉండకూడదు. కానీ చాలామందిలో ఇది ఉంటుంది.
సృష్టి మనకు ఒకరోజు తరువాత మరో రోజుని ప్రసాదిస్తుంది. వాటిని అనుభవిస్తూ సాగాలి. జాగ్రత్త అవసరమే. కానీ ఎప్పుడో జరుగబోయే సంఘటనలని ఊహిస్తూ కాలాన్ని వృథా చేయకూడదు. మనిషి జీవితంలో ఎన్ని పేజీలు ఉన్నాయో మనకు తెలియదు.
‘ఈ రోజుని అనుభవించు’ అని పెద్దవాళ్లు చెబుతారు. అంటే ‘ప్రస్తుతంలో జీవించూ’ అని. పెద్దవాళ్లు చెప్పిన ఈ వాక్యాలని తరచూ గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడు మనం ప్రస్తుతంలో నివసించడం మొదలుపెడతాం.
మనిషి జీవితంలో ఆ రోజు అనే పేజీని వదిలేసి, ఇంకా మరికొన్ని రోజుల పేజీలను వదిలేసి చివరి పేజీలోకి వెళ్లే అవకాశం ఉండదు. అందుకని జీవితంలోని చివరి పేజీ గురించి ఆలోచిస్తూ ఆదుర్దా పడకూడదు. అట్లా అని చివరి పేజీ గురించి ప్రణాళిక చేసుకోకూడదని అనడం లేదు. అది అవసరమే.
మనిషి జీవితంలో ఎన్ని పేజీలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఆరోగ్యంగా వున్న వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోవచ్చు. అనారోగ్యంతో వున్న వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకొని జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఉండవచ్చు.
ప్రతి పేజీ మన చివరి పేజీ అని భావిస్తే పనులని వాయిదా వేయం. అదే విధంగా ఆ రోజుని సంపూర్ణంగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం.
జీవితం కథ కాదు. నవల కాదు. సినిమా అంతకంటే కాదు. అందుకని చివరి పేజీ కోసం పరుగెత్తకూడదు. మనిషి ప్రతిరోజూ చివరి పేజీ అనుకుంటూ బతకాలి.
గడిచిన పేజీల్లో స్ఫూర్తిని ఇవ్వని పేజీలు ఎన్నో ఉండవచ్చు. వాటి గురించి ఆలోచించి మనస్సు పాడుచేసుకునే బదులు, వాటికి సిలోఫెన్ టిప్ వేసి కొత్త పుటని తెరవాలి. కొత్త పుటలోని విజయాలనే సమా జం గుర్తు పెట్టుకుంటుంది. అది మన జీవితంలోని చివరి పేజీ కావొచ్చు.