ఓ చిన్నమాట!

బలహీనత ఓ చిన్నమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాట్సప్‌లు వచ్చిన తరువాత మన 24 గంటల్లోని ఓ అరగంట కనీసం ఆ వాట్సప్ మెసేజ్‌లను చూడడానికే సరిపోతుంది. ప్రతి కొత్త ఆవిష్కరణల వెనక కొంత మంచీ చెడు ఎప్పుడూ ఉంటాయి. వాట్సప్‌ల విషయంలోనూ అంతే! దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దుర్వినియోగం చేసుకోవచ్చు. దుర్వినియోగం చేసుకుంటున్న వ్యక్తుల సంఖ్యే ఎక్కువగా కన్పిస్తుంది.
వాట్సప్ గ్రూప్‌లు కూడా ఎక్కువై పోతున్నాయి. మన ప్రమేయం లేకుండానే మనల్ని చాలా గ్రూపుల్లో చేరుస్తున్నారు. కొంత సమాచారం తెలుస్తుందని, కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయని తమ ప్రమేయం లేని గ్రూపుల్లో కొంతమంది కొనసాగుతూ ఉంటారు.
ఏదైనా క్రియేటివ్‌గా ఆలోచించి సమాచారం గ్రూపుల్లో పోస్ట్ చేస్తే బాగుంటుంది. అదే విధంగా అందరికీ తెలియాల్సిన సమాచారం అందులో పోస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ మధ్య కొంతమంది నానా చెత్త గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. గుడ్‌మార్నింగ్ పోస్ట్‌లు ఒకే వ్యక్తి ఐదారుకన్నా ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. అతను వివిధ గ్రూపుల్లో వుండటం వచ్చిన సమాచారం అంతా గ్రూపుల్లో పోస్ట్ చేసి చాలామందికి అసౌకర్యం కలుగజేస్తున్నారు.
ఈ మధ్య ఓ గ్రూపులో ఓ వ్యక్తి మంచి హోదా వున్న వ్యక్తే. రోజూ పది నుంచి ఇరవై పోస్ట్‌లు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అందులో ఎన్నో వీడియోలు కూడా ఉంటాయి. ఆడవాళ్లని కించపరిచే వీడియోను ఒకసారి పోస్ట్ చేశాడు. ఆ గ్రూపులో వున్న ఓ మహిళ అధికారి నొచ్చుకున్నారు. ఆ తరువాత అతను బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఆ వ్యక్తి నాకు బాగా తెలిసిన వ్యక్తి. అందుకని అనవసర పోస్ట్‌లు ఎందుకు వేస్తున్నారని అతనికి వ్యక్తిగతంగా సందేశం పెట్టాను. అక్కడ తాను ఒక్కడినే ఉంటున్నానని, అందుకని సమయం ఎక్కువగా ఉంటుందని, అందుకని అలా చేస్తున్నానని చెప్పాడు. తగ్గిస్తానని చెప్పాడు.
కానీ అలా జరగలేదు. మళ్లీ అదే విధంగా పోస్ట్‌లు చేయడం కొనసాగించాడు. అందులో మళ్లీ ఓ చెత్త వీడియోని పోస్ట్ చేశాడు. అది ఆడవాళ్లని కుటుంబ వ్యవస్థని కించపరిచే వీడియో. ఈసారి వ్యక్తిగతంగా కాకుండా గ్రూపులోనే దయచేసి ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేయకండని మెసేజ్ నేను పోస్ట్ చేశాను. మరో ఇద్దరు అలాంటి భావననే వ్యక్తపరిచారు. అతను కొంతమంది స్వచ్ఛమైన వ్యక్తులని గాయపరిచినందుకు క్షమించండి అని పోస్ట్ చేశాడు. ఆ మెసేజ్‌లో పశ్చాత్తాపం కన్నా ఆక్రోశం ఎక్కువగా ఉంది.
ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అదే విధంగా మళ్లీ రోజూ లెక్కలేనన్ని పోస్ట్‌లు. అయితే చెత్త పోస్టింగ్‌లు తగ్గిపోయాయి.
పోస్ట్‌లు చేయడం ఆయన బలహీనత. ఆయనని సంస్కరించాలన్నది నా బలహీనత. ఎందుకంటే అతను మంచి ఉద్యోగి. (న్యాయమూర్తి.)

- జింబో 94404 83001