S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

07/09/2016 - 21:20

చదువుతున్నప్పటి నుంచి సాహిత్యం మీద మక్కువ ఎక్కువ. చాలా సమయాన్ని సాహిత్యానికే వెచ్చించేవాణ్ని. ఎప్పుడూ కవిత్వం, కథలూ చదవడం చూసి మా అమ్మ అంది. ‘వాటివల్ల ఏం వస్తుందిరా? నీ చదువు పుస్తకాలు చదువుకుంటే మంచిది కదా’

07/02/2016 - 21:45

‘త్రీ ఇడియట్స్’ అన్న సినిమాలో ఓ ప్రొఫెసర్ ఏ మాత్రం సమయం వృథా చేయకుండా ఒకేసారి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. చాలా పనులు చేసుకోవాలి. కానీ భోజనం చేసేటప్పుడు వేరే పనులు చేయకూడదు.

06/25/2016 - 23:25

భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం జరగడం అత్యంత సహజం. మాటల యుద్ధంలో ఎలాంటి పరిమితులు లేకుండా మాటలు జారుతూ ఉంటారు. కొంతమంది విడాకులు ఇవ్వాలని అంటే మరికొంత మంది పొరపాటున పెళ్లి చేసుకున్నామని అంటూ ఉంటారు. ‘నువ్వు ఛస్తే పీడ వదులుతుంద’ని మరి కొంతమంది అంటూ ఉంటారు. ఇలాంటి మాటల యుద్ధాలు భార్యాభర్తల మధ్యనే కాదు స్నేహితుల మధ్య కూడా జరుగుతుంటాయి.

06/18/2016 - 21:14

గతంలోకి ప్రయాణించడం చాలామందికి అలవాటు. ప్రస్తుతం కన్నా గతం మధురమని చాలామంది తరచూ అనుకుంటూ వుంటారు. స్మృతులు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. చిన్నప్పటి ఆటలు, పాటలు, వేషాలూ గుర్తుకు తెచ్చుకొని ఆనందించడం సహజం. అయితే మనందరం మరిచిపోతున్న విషయం ఒకటి ఉంది. ఈ రోజు కూడా కొద్ది రోజులకి గతం అవుతుంది. ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల తరువాత ఓ మధుర స్మృతి అవుతుంది.

06/11/2016 - 21:03

పార్క్‌కి వెళ్లినప్పుడల్లా ఓ గమ్మతె్తైన దృశ్యం కనపడుతుంది. ఓ ఇరవై మంది నిల్చోని బిగ్గరగా నవ్వుతూ కన్పిస్తారు. సరదాగా మాట్లాడుతూ నవ్వుకోవడం కాదు. నవ్వాలని నవ్వడం. దాన్ని ఓ క్లబ్‌గా కూడా పిల్చుకుంటారు. అదే లాఫింగ్ క్లబ్. జీవితంలో నవ్వడం మరిచిపోయి ఉదయం అందరూ జమకూడి నవ్వుతూ ఉంటారు.

06/04/2016 - 21:34

చాలా రోజుల క్రితం మాట. అప్పుడు హైదరాబాద్‌లో ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. అది ఓ ప్రత్యేక కోర్సు. ఆహార కల్తీ చేసే వ్యక్తుల నేరస్తుల కేసులని విచారించే కోర్టు. ఆహారం కల్తీ నిరోధక చట్టం అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆ కోర్టులో ఓ రెండు సంవత్సరాలు పని చేసిన తరువాత ఆ చట్టం మీద మంచి అవగాహన ఏర్పడింది.

05/29/2016 - 00:24

కుటుంబం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైంది. కుటుంబం లేకుండా ఒంటరిగా జీవించడం అంత సులువైన విషయం కాదు. చాలామంది పెద్దవాళ్లు వృద్ధాశ్రమాలకి వెళ్తున్నారు. కాదు. వాళ్లు ఆ విధంగా వుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆశ్రమాల్లో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. సరైన సమయానికి టిఫిన్, భోజనాలు, వైద్య సదుపాయాలు ఇట్లా ఎన్నో. కానీ ఆ పెద్దవాళ్లల్లో ఏదో కన్పించని బాధ.

05/21/2016 - 21:00

కాలేజీ విద్యార్థులకి ప్రేరణ కలిగించడానికి ఓ గురువుని పిలిచారు.
కాస్సేపు చాలా విషయాలు విద్యార్థులతో మాట్లాడిన తరువాత తన జేబులో నుంచి ఓ బంగారు ఉంగరాన్ని తీసి పైకి ఎత్తి అందరికీ కన్పించేలా పట్టుకున్నాడు.
‘ఈ ఉంగరం ఎవరికి కావాలి?’ అడిగాడు.
ఎంతోమంది తమకి కావాలని చేతులెత్తారు.
కాస్సేపటి తరువాత ‘నాకు’ ‘నాకు’ అన్న మాటలు కూడా విన్పించాయి.

05/14/2016 - 22:21

డిసెంబర్ నెల వచ్చినప్పుడల్లా ఇంటిని కొంత ఖాళీ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాను. దినపత్రికలు, వారపత్రికలు, ప్రత్యేక సంచికలు, టెలిఫోన్ బిల్లులు, నల్లా బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, పుస్తకాలు, వ్రాసిన కాగితాలు, పాతబడిన బట్టలు, రాసిన డైరీలు, రాయని డైరీలు, క్యాలెండర్లు, తీర్పుల ప్రతులు, ఇట్లా ఎన్నో.

05/07/2016 - 21:20

కాలేజీ జీవితానికి, యూనివర్సిటీ జీవితానికి చాలా భేదం ఉంటుంది. కాలేజీల్లో వున్నప్పుడు అంత పరిపక్వత చాలామంది విద్యార్థుల్లో ఉండదు. యూనివర్సిటీకి వచ్చేవరకు పరిపక్వత వస్తుంది. ప్రేమల విషయం కూడా అంతే! యూనివర్సిటీల్లో ప్రేమించుకున్న వ్యక్తులు చాలామంది వివాహాలు చేసుకుంటారు.

Pages