S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట!
ఓసారి నేనూ నా మిత్రుడు కలిసి కార్లో వెళ్తున్నాం. నగరంలోని ప్రతి చౌరస్తా దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. వాహనాలు ఆపడం తప్పనిసరి. ప్రతి చౌరస్తా దగ్గర భిక్షం అడుక్కోవడానికి ఎంతోమంది. ఏసి కార్లు వచ్చిన తరువాత కారు అద్దాలు ఎప్పుడూ మూసి ఉంటున్నాయి. ఇది యాచకులకి కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. కిటికీ నుంచి చూస్తే పర్వాలేదు. వాళ్లకి ఇబ్బంది లేదు. మనం ఏదన్నా పనిలో ఉంటే మాత్రం వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది.
యూనివర్సిటీ హాస్టల్‌లో మా రూం పక్కన ఓ మిత్రుడు ఉండేవాడు. అతనిది వేరే జిల్లా. నాది వేరే జిల్లా. బాగా డబ్బు సంపాదించాలన్నది అతని కోరిక.
-జింబో
(94404 83001)
----------------
నా మొఖాన్ని చూసి మోసపోవద్దు. ప్రతిరోజూ కొన్ని వందల వేల ముసుగులతో నా మొహం ప్రదర్శితమవుతుంది. మోసపోకండి. ఈ మొఖాల్లో ఏ మొఖమూ నా మొఖం కాదు.
నాకున్నది ఒక్క మొహమే. కానీ వందల మొఖాలతో దర్శనం ఇస్తూంటాను.
చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తుంటే చిన్న కుక్కపిల్ల కన్పించింది. ఒక్కటే. దాని చుట్టూ ఎవరూ లేరు. చూస్తే చాలా ముద్దుగా అన్పించింది. మెరిసే కళ్లు. ఆనందంతో కదిలే చెవులు. దాన్ని చూడగానే నాకు ప్రేమ కలిగింది. దగ్గరికి తీసుకుని దాని తల మీద నిమిరాను.
అంతే!
పెన్నుకి పెన్సిల్‌కి తేడా ఉంది. పెన్సిల్‌ని తరచూ పదును చేసుకోవాల్సి ఉంటుంది. అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. పెన్ను అలా కాదు. సిరా అయిపోతే మళ్లీ పోసుకోవచ్చు.
పెన్సిల్‌ని చూసినప్పుడు నాకు మనిషి గుర్తుకొస్తాడు. మనిషి కూడా పెన్సిల్‌లా మారాలి. అరిగిపోయినప్పుడల్లా తనని తాను పదును చేసుకోవాలి. ఆ విధంగా పదును చేసుకుంటేనే పెన్సిల్‌లా బొమ్మలు గీయగలడు. రాయగలడు.
కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే దాదాపు పది రోజులు గడిచాయి. కాలం ఎవరి కోసం ఆగదు. పరుగెడుతూనే ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తుందనగానే ఎన్నో ఆలోచనలు. మరెన్నో ప్రణాళికలు. ప్రతి సంవత్సరం ఎన్నో ప్రణాళికలు వేస్తూనే ఉంటాం కానీ అమలు చేయడంలో చాలామంది విఫలం అవుతుంటారు. వారం పది రోజులు ప్రణాళికల గురించి సీరియస్‌గానే ఉంటారు. ఆ తరువాత ఆ సీరియస్‌నెస్ తగ్గిపోతుంది.
ఈ రోజుల్లో యువకులు అన్నీ సులువుగా రావాలని కోరుకుంటున్నారు. ఈజీమనీ, ఈజీ లైఫ్. ఇలా ఎన్నో... ఇది గమనించినప్పుడల్లా నా చిన్ననాటి సంఘటన గుర్తుకొస్తుంది.
సుధాకర్ జీవిత ప్రయాణం చాలా సుఖంగా సాగింది. నాలుగు రోడ్ల హైవే మీద విలాసవంతమైన కారులో ప్రయాణం చేసినంత హాయిగా అతని ప్రయాణం సాగింది. ఒక్కడే కొడుకు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అది హైదరాబాద్‌లో. అతని పెళ్లి కూడా చేశాడు. ఆ తరువాత సమస్యలు మొదలయ్యాయి. కొడుకు కోడలు మధ్య చిన్నచిన్న సమస్యలు చాలా పెద్దగా మారిపోయి సుధాకర్‌ని భయపెట్టాయి.
మనకు చాలా మంచి మిత్రులు ఉంటారు. కొంతమందికి స్వీట్స్ ఇష్టం ఉంటే మరి కొంతమందికి మందు ఇష్టం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏవో ఏవో ఇష్టాలు ఉంటాయి.