ఓ చిన్నమాట!

పెన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్నుకి పెన్సిల్‌కి తేడా ఉంది. పెన్సిల్‌ని తరచూ పదును చేసుకోవాల్సి ఉంటుంది. అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. పెన్ను అలా కాదు. సిరా అయిపోతే మళ్లీ పోసుకోవచ్చు.
పెన్సిల్‌ని చూసినప్పుడు నాకు మనిషి గుర్తుకొస్తాడు. మనిషి కూడా పెన్సిల్‌లా మారాలి. అరిగిపోయినప్పుడల్లా తనని తాను పదును చేసుకోవాలి. ఆ విధంగా పదును చేసుకుంటేనే పెన్సిల్‌లా బొమ్మలు గీయగలడు. రాయగలడు.
పెన్సిల్ రాసిన కొద్దీ తరిగిపోతుంది. కానీ మనిషి ఏమీ రాయకపోయినా, ఏమీ చేయకపోయినా అతని జీవితం తరిగిపోతూనే ఉంటుంది. అందుకని తనని తాను పదును చేసుకోవడం చాలా అవసరం. పదును చేసుకొని తగ్గిపోవడం చాలా అవసరం. పెన్సిల్‌లోని లెడ్ మాదిరిగా పదును తేలితే కొంత అందంగా రాయగలం.
చాలామంది మార్చుకోవడానికి ఇష్టపడరు. కానీ రోజురోజుకీ మార్పులు తెచ్చుకోవాలి. మార్పు అంటే పదును తేవాలి. నేనింతే! భగవంతుడు నన్ను ఇంతే సృష్టించాడు. నేను ఇలానే ఉంటాను అనుకోవడానికి వీల్లేదు. మనలో మనం మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ మనల్ని మనం అంచనా వేసుకోవాలి. తప్పిదాలను, పొరపాట్లను సరిదిద్దుకోవాలి. కొత్త వ్యక్తిగా మార్పు చెందాలి. ఒక దగ్గర స్థిరంగా ఉండకూడదు. కొత్త వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
బాగా రాయడానికి పెన్సిల్‌ని ఏ విధంగానైతే పదును పెడతామో మనల్ని మనం ఆ విధంగానే పదును చేసుకోవాలి. ఆ విధంగా పదును చేసుకున్న చాలామంది వ్యక్తులను చూశాను. వాళ్లు విజయపథంలో కొనసాగడం చూశాను. ఓడిపోయిన వ్యక్తులు విజయం సాధించడం చూశాను. నిరుత్సాహంగా ఉండే వ్యక్తులు ఉత్సాహంగా మారడం చూశాను. నిజమైన వ్యక్తుల్లో ఊహించని మార్పులను గమనించాను.
మనం సృష్టించబడ్డాం. అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేకుండానే మనం సృష్టించబడ్డాం. అందరి విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే కొంత మంది మాత్రం తమని తాము పునః సృష్టించుకుంటారు.
పునః సృష్టించుకోవాలంటే ప్రతిరోజూ మనల్ని మనం పదును చేసుకోవాలి. అప్పడే సరిగ్గా రాయగలం. బొమ్మలు వేయగలం. మనల్ని మనం పదును చేసుకోకున్నా కూడా మన జీవితం తరిగిపోతూనే ఉంటుంది. అందుకని పదును చేసుకోవాలి.
మన సృష్టి మన చేతుల్లో లేదు. కాని మన పునఃసృష్టి మన చేతుల్లోనే ఉంది.
పెన్సిల్‌ని చూసి మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఇదే!

====================
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు,
రచనలు, కార్టూన్లు, ఫొటోలు
bhoomisunday@deccanmail.comకు
కూడా పంపించవచ్చు.

=======================

-జింబో 94404 83001