S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముసుగు (ఓ చిన్నమాట!)

-జింబో
(94404 83001)
----------------

నా మొఖాన్ని చూసి మోసపోవద్దు. ప్రతిరోజూ కొన్ని వందల వేల ముసుగులతో నా మొహం ప్రదర్శితమవుతుంది. మోసపోకండి. ఈ మొఖాల్లో ఏ మొఖమూ నా మొఖం కాదు.
నాకున్నది ఒక్క మొహమే. కానీ వందల మొఖాలతో దర్శనం ఇస్తూంటాను.
ఇంట్లో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నా మొఖం ఒక రకమైన ముసుగుని ధరిస్తుంది. భార్యతో మాట్లాడుతున్నప్పుడు మరో రకమైన ముసుగుని నా మొఖం ధరిస్తుంది.
పై అధికారి దగ్గరికి వెళ్లినప్పుడు ఒక రకమైన ముసుగు. క్రింది అధికారితో మాట్లాడినప్పుడు మరో రకమైన ముసుగు. పని వున్నప్పుడు ఒక రకమైన ముసుగు. ఎవరైనా పని కోసం వచ్చినప్పుడు మరో రకమైన ముసుగు. అధికారినిబట్టి అవసరాన్ని బట్టి మొఖం మీద ముసుగు మారిపోతూ ఉంటుంది.
చాలాసార్లు ప్రశాంతంగా, నమ్మకంగా ధైర్యంగా ఉన్నట్టు నా మొఖం కన్పిస్తుంది. కానీ లోన ఎన్నో భయాలు, సంశయాలు, ఆందోళనలు.
రోజూ ముసుగుల ప్రవాహం, కవాతు జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవాహంలో నా నిజమైన మొఖం గుర్తుపట్టడం చాలా కష్టం.
నేనెవరో మీకు తెలుసా?
మీరు కలిసే ప్రతి మనిషిని
ఇంకా చెప్పాలంటే నేను, మీరు కూడా.
మన మొఖాలకి ముసుగులు లేవు
కానీ
రోజంతా ముసుగులు వేసుకొనే బతుకుతాం
త్వరితగతిన ముసుగులని మారుస్తూ బతుకుతాం
ఈ ముసుగులు లేని జీవితం ఉంటే
ఎంత బాగుండు!?
ఈ ముసుగుల ప్రపంచం చూసి ఓ తెలుగు కవి మనం జీవిస్తున్న బతుకు బతుకు కాదని అన్నాడు. తల్లి గర్భంలో వున్న తొమ్మిది మాసాలే బతుకన్నాడు. ఇలా అంటాడు.
నే చచ్చిపోతాననే కదూ
నీ బాధ
పిచ్చివాడా-
ఈ వ్యవస్థలో
మనం బతికింది
తొమ్మిది మాసాలే!
*
మనం పుట్టిన తరువాత మనం మనలా బతకడం లేదు. ముసుగులతో బతుకుతున్నాం. మరో రకంగా బతుకుతున్నాం.
మనం మనలా ఎప్పుడు బతకడం ప్రారంభిస్తామో.
*