S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

12/25/2016 - 00:41

ప్రపంచంలో మంచితనం వుంది. ప్రజల్లో చాలా మంచివాళ్లు ఉన్నారు. రాజకీయ నాయకుల్లో మంచి వ్యక్తులు వున్నారు. ఈ పరిస్థితి ప్రతి వ్యవస్థలో వుంది. డాక్టర్లు, పోలీసులు, వ్యాపారులు, న్యాయవాదులు, అధికారులు అందరూ చెడ్డవాళ్లు కాదు. వాళ్లలో ఎంతోమంది మంచి వ్యక్తులు వున్నారు. మీడియాలోనూ అంతే!

12/18/2016 - 00:34

‘కారు బ్రేకులు వేస్తుంటే శబ్దం వస్తుంది. దాన్ని సర్వీసింగ్ తీసుకొని వెళ్లాలి సార్’ చెప్పాడు మా డ్రైవర్.
అంతకు ముందే సర్వీస్ స్టేషన్ నుంచి మెసేజ్ వచ్చింది. కారు సర్వీస్ చేయించాల్సి ఉందనిదాని సారాంశం. వచ్చేవారం మా ఊరు వెళ్లాల్సి వుంది. అందుకని దాన్ని సర్వీసింగ్‌కి ఆ మరునాడే పంపించాను. ఓ రెండు రోజులు కారు లేక ఇబ్బంది కలిగినా భరించి సర్వీసింగ్‌కి పంపించాను.

12/11/2016 - 01:13

విమర్శ లేకుండా జీవితం గడవదు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఎప్పుడూ విమర్శ కొనసాగుతూనే ఉంటుంది. విమర్శల్లో సద్విమర్శ కూడా ఉంటుంది. విమర్శలోని మంచిని మనం గ్రహించగలగాలి. అప్పుడు కొంత వృద్ధి చేసుకోగలుగుతాం.

12/03/2016 - 23:35

నేను మా అమ్మాయి ఆల్బమ్ తిరగేస్తుంటే నేను ఓ మీటింగ్‌లో పాల్గొన్న ఫొటో కనిపించింది. నా పక్కన ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. అతను కాళ్లు బాగా చాపి కూర్చున్నాడు. ‘ఇంత నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తి ఎవరు?’ అని మా అమ్మాయి అడిగింది. ఆ కుర్రవాడు చాలా మంచివాడని చెప్పడానికి కొంత సమయం పట్టింది.

12/03/2016 - 21:04

వయస్సుతో నిమిత్తం లేకుండా కొంతమంది చాలా హుషారుగా ఉంటుంటారు. స్పోర్ట్స్ షూస్ వేసుకొని, టీషర్ట్‌లు వేసుకుని కూడా కన్పిస్తుంటారు. మీసాలకి, తల వెంట్రుకలకి రంగు వేసుకొని కూడా దర్శనం ఇస్తుంటారు. వాళ్ల వయస్సు ఓ పది నుంచి ఇరవై సంవత్సరాలు తగ్గినట్టుగా కూడా కన్పిస్తుంటారు. వాళ్లు తమ యుక్తవయస్సులో కూడా అంత శ్రద్ధ తీసుకొని ఉండరు.

11/20/2016 - 00:32

పత్రికా మిత్రులు ఎక్కువగా ఉపయోగించే పదం డెడ్‌లైన్. తెలుగులో దాన్ని మనం చివరి గడువు అంటాం. పత్రికలో ఆదివారం అనుబంధం పేజీలు ముగించడానికి ఓ చివరి గడువు ఉంటుంది. అదే విధంగా ప్రతీ పత్రికకి చివరి గడువు ఉంటుంది. వార్తలకి కూడా చివరి గడువు ఉంటుంది. ఆ చివరి గడువు తరువాత పత్రిక ప్రచురణకి వెళ్లిపోతుంది. సంపాదకీయానికి అంతే. చివరి గడువు లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ చివరి గడువు తరువాత ఆ వార్తకి విలువ ఉండదు.

11/12/2016 - 20:48

చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవాణ్ని. కాస్త పెద్ద అయిన తరువాత యువ, భూమి, జ్యోతి లాంటి పత్రికలు చదివేవాణ్ని. మా రఘుపతన్నకి సాహిత్యం అంటే మక్కువ. శ్రీశ్రీ, దాశరథి, నారాయణరెడ్డి, కాళోజీ లాంటి కవిత్వ పుస్తకాలతోబాటూ, చలం, బుచ్చిబాబు, శ్రీపాద, రంగనాయకమ్మల పుస్తకాలు లెక్కలేనన్ని వుండేవి.

11/05/2016 - 23:54

మా క్లాస్‌మేట్స్ చాలామంది రూంలు తీసుకొని కరీంనగర్‌లో చదువుకునేవారు. అప్పుడు ఇన్ని హాస్టల్స్ లేవు. అందుకని వాళ్లు రూంలలో ఉండేవాళ్లు. వంట వాళ్లే వండుకునేవాళ్లు. నాకు అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే కరీంనగర్‌లో మా రాధక్క ఉండేది. ఆమె దగ్గర ఉండటం వల్ల వంట అన్నది అవసరం పడలేదు.

10/28/2016 - 23:15

ఓ రోజు ఉదయం మా ఇంటి దగ్గర్లో వున్న హోటల్‌కి వెళ్లాను. అక్కడ సెల్ఫ్ సర్వీస్. మనమే తెచ్చుకొని తినాలి. టీ కూడా అంతే. టీ వాసన గుప్పుమన్నది. టీ చాలా బాగుంది. వెంటనే ఆ విషయం టీ తయారుచేస్తున్న వ్యక్తికి చెప్పాను. అతని మొఖం విప్పారింది. ఎప్పుడు అక్కడికి వెళ్లినా అతను ఆనందంగా పలకరిస్తాడు. మంచి టీ తయారుచేసి ఇస్తాడు.

10/23/2016 - 00:53

ఓ రెండు సంవత్సరాల క్రితం ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. అది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. చాలా రాష్ట్రాలకి చెందిన కవులూ రచయితలు పాల్గొంటున్న కార్యక్రమం.

Pages