S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సృష్టికర్త

ఈ మధ్యన ఓ విచిత్రమైన కథనాన్ని చదివాను. అందులోని లాజిక్ నన్ను ఆలోచనలో పడేసింది. ఆ లాజిక్ ఎవరినైనా ఆలోచనలో పడేస్తుంది. ఆ కథనం మీకు చెబుతాను.
అమెరికాలోని ఓ రైలు బండిలో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తే బాగా చదువుకున్న వాడిలా వున్నాడు. అధునాతనంగా ఉన్నాడు. అతని చేతిలో బైబిల్ ఉంది. అతను బైబిల్ చదవడంలో నిమగ్నమై వున్నాడు.
కాస్సేపటికి అతని ఎదురుగా మరో వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అతని వేషభాషలు అధునాతనంగా ఉన్నాయి. తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి బైబిల్ చదవడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది.
ఆ కొత్త వ్యక్తి బైబిల్ చదువుతున్న వ్యక్తితో సంభాషణ మొదలుపెట్టాడు. సైన్సులో జరుగుతున్న పురోగతిని అతను ఆ వ్యక్తికి వివరించాడు.
‘సైన్సు ఇంత పురోగతి చెందుతున్న కాలంలో మీరు ఇంకా బైబిల్ చదవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ పుక్కిటి పురాణాల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అన్నాడు.
‘అవును. సైన్సు పురోగతి చెందుతున్న కాలంలో కూడా నేను బైబిల్ చదువుతాను’ సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆ తరువాత బైబిల్ చదవడంలో నిమగ్నమై పోయాడు.
అతని సమాధానం ఆ కొత్త వ్యక్తికి నచ్చలేదు.
‘తానొక సైంటిస్టునని, ఎప్పుడైనా సమయం తీసుకొని తన ఇంటికి వచ్చి సైన్సు గురించి చర్చించమని చెబుతూ తన కార్డుని బైబిల్ చదువుతున్న వ్యక్తికి ఇచ్చాడు. అతను ఆ కార్డుని తీసుకొని తన బైబిల్ పుస్తకంలో పెట్టుకున్నాడు.
ఆ సైంటిస్టు తనని బైబిల్ చదువుకోనివ్వడని అర్థమై అతను చెప్పే విషయాలని వింటూ కూర్చున్నాడు.
ఓ అరగంట తరువాత ఇద్దరు దిగే స్టేషన్ వచ్చింది.
‘నా గురించి చెప్పాను. నా కార్డు కూడా ఇచ్చాను. మీ గురించి చెప్పలేదు. మీ పేరేమిటీ?’ అడిగాడు ఆ సైంటిస్టు.
‘నా పేరు థామస్ అల్వా ఎడిసన్’ నెమ్మదిగా గంభీర స్వరంతో జవాబిచ్చాడు ఆ వ్యక్తి.
ఆశ్చర్యపోవడం ఆ సైంటిస్ట్ వంతైంది.
‘ఇంత పెద్ద సైంటిస్ట్ అయి మీరు బైబిల్ చదువుతారా?’ మళ్లీ అడిగాడు.
‘అవును’ అని చెప్పాడు నవ్వుతూ ఎడిసన్.
‘సార్! ఓ రోజు మీ దగ్గరికి వచ్చి మళ్లీ ఈ సృష్టి గురించి చర్చిస్తాను’ అన్నాడు ఆ సైంటిస్ట్.
నెమ్మదిగా, గంభీర స్వరంతో జవాబిస్తాడు ఆ వ్యక్తి. ఆశ్చర్యానందాలకు లోనైన రెండవ సైంటిస్ట్ ‘నమ్మశక్యంగా లేదు.. నేను మిమ్మల్ని అతి త్వరలో మీ ఇంటిలో కలుసుకుంటాను’ అని చెప్పి సెలవు తీసుకుంటాడు.
అనుకున్నట్టుగా ఒకరోజు అపాయింట్‌మెంట్ తీసుకొని థామస్ అల్వా ఎడిసన్‌ను కలుస్తాడు ఈ సైంటిస్ట్. అతని గృహంలోనికి వెళ్లగానే అక్కడ టేబుల్ పైన ఉన్న సౌర మండలం రెప్లికా అతన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ‘ఇది ఎవరు తయారుచేశారు? చాలా బాగుంది’ అంటాడు ప్రశంసాపూర్వకంగా.
‘ఏమో.. నాకు తెలియదు. నిన్న రాత్రి ఇది ఇక్కడ లేదు. ఇప్పుడు ఉంది.. ఎవరు తయారుచేశారో తెలీదు..’ జవాబిచ్చాడు ఎడిసన్.
‘పరిహాసానికి కూడా హద్దుంటుంది సార్! ఎవరూ తయారుచేయకుండా ఇది ఇక్కడ ఎలా ఉంటుంది.. చెప్పండి’ బతిమాలే ధోరణిలో అడుగుతాడు ఆ సైంటిస్ట్.
దానికి ఎడిసన్ - ప్రశాంత స్వరంతో ఇలా జవాబిస్తాడు. ‘అతి మామూలు ముడి పదార్థాలతో, నిర్మితమైన ఈ చిన్ని తయారీ - ఎవరూ చేయకుండానే ఇక్కడ ఉంది అంటే మీరు నమ్మడం లేదు.. ఎన్నో ఖగోళ వింతలతో, జవ జీవాలతో అలరారే ఈ సువిశాల విశ్వపు సృష్టికర్త ఒకరు ఉన్నారంటే మాత్రం ఒప్పుకోరు.. అదెలా సాధ్యం...’
ఆ సైంటిస్ట్‌కి నోట మాట రాలేదు.
*

- జింబో 94404 83001