ఓ చిన్నమాట!

చిరునవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రబుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు చాలామంది ముఖాలు చిట్లిస్తూ కూర్చుంటారు. ఒక్క ఉద్యోగి కూడా చిరునవ్వుతో కనిపించడు. చిరునవ్వుతో కనిపిస్తే వాళ్ల సొమ్ము ఏదో పోయినట్టుగా వుంటారు. కాస్త ఉల్లాసంగా ఉంటే ఎదుటి వ్యక్తులకి ఏదైనా సహాయం చేయాల్సి ఉంటుందేమోనని అన్నట్టుగా వాళ్ల ప్రవర్తన ఉంటుంది. ఇదే పరిస్థితి కూడా బ్యాంకుల్లో కన్పిస్తుంది. ఎంత పని ఒత్తిడి వున్నా కాస్త నవ్వుతూ సమాధానం చెబితే కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది గుర్తించరు.
కోర్టుల్లో కూడా చాలామంది న్యాయమూర్తులు గంభీరంగా ఉంటారు. కాస్త నవ్వుతూ కన్పిస్తే న్యాయవాదులు వాయిదాలు అడుగుతారని లేదా ఇంకా ఏదో సహాయం కోరుతారని న్యాయమూర్తులు భావిస్తుంటారు. నిజానికి నవ్వుతూ కూడా అవసరం లేని విషయాలని నిరాకరించవచ్చు. కానీ ఎందుకో ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. నవ్వుతూ కన్పిస్తే ఇతరులు దోపిడీ చేస్తారని భావిస్తూంటారు. ఇది కూడా సరైన అభిప్రాయం కాదు. ఒక చిన్న చిరునవ్వు ఎదుటి వాళ్ల బాధలని కొంతమేరకు తొలగిస్తుంది.
చిన్న చిరునవ్వు అనేది ఒక చిన్న కానుకగా చాలామంది గుర్తించరు. ఇతరులకి మనం ఇచ్చే ఓ గొప్ప కానుక చిరునవ్వు. ఈ విషయాన్ని గుర్తిస్తే చాలామంది జీవితాలు ఆనందమయం కావడానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఓ సూపర్ మార్కెట్‌లో ఓ పెద్దమనిషి కన్పించాడు. అతను ఏదో కోల్పోయినట్టు వేదనతో కన్పించాడు. అతని పక్క నుంచి వెళ్తూ చిరునవ్వుతో అతని వైపు చూశాను. గంభీరంగా వున్న అతని మొఖం మీద చిన్న చిరునవ్వు మెరిసింది. అతని కళ్లు ఆనందంతో వెలిగాయి.
అతను ఎందుకు గంభీరంగా ఉన్నాడో, బాధగా కనిపించాడో తెలియదు కానీ నా చిన్న చిరునవ్వు అతని మొఖం మీద మరో చిన్న చిరునవ్వుని వెలిగించింది.
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వొత్తిడిలో ఉంటున్నాడు. అందుకని ఆ వ్యక్తి వొత్తిడి తగ్గించడానికి మనం ఇచ్చే కానుక చిన్న చిరునవ్వు. ఆ చిరునవ్వు ఆ వ్యక్తి మొఖం మీద కొంతసేపే కనిపించినా దాని ప్రభావం చాలాసేపు ఉంటుంది. ఆ తేడా చిరునవ్వుని కానుకగా ఇచ్చిన మనకి తెలియకపోవచ్చు. కానీ ఆ చిరునవ్వుని కానుకగా పొందిన వ్యక్తికి మాత్రం తెలుస్తుంది.
ఈ కానుకకి మనము ఎలాంటి డబ్బుని ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఎలాంటి సమయాన్ని వెచ్చించాల్సిన పని లేదు. చిన్న చిరునవ్వు ఓ దీపంలా ఇంకో చిరునవ్వుని వెలిగించాలి.
విలువ కట్టలేని కానుక చిన్న చిరునవ్వు.
ఈ చిరునవ్వు ఎదుటి వ్యక్తులకి ఇచ్చిన కానుకే కాదు.
ఇది మనకు మనము ఇచ్చుకున్న కానుక.
సమస్యలు లేని వ్యక్తులు ఎవరూ లేరు.
చిన్న చిరునవ్వు సమస్యలను తొలగించకపోయినా కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.
మన మొఖం మీద సంతకంలా చిరునవ్వు వెలగాలి.

- జింబో 94404 83001