S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అణుకువ

అణుకువతో వుండటం చాలా అవసరం. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక చాలామంది డాంబికం ప్రదర్శిస్తూ వుంటారు. దానివల్ల ఇతరులతో వాళ్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది డాంబికాన్ని వదులుకోరు.
ఈ మధ్యన ఓ మిత్రుడు ఓ చిన్న కథ చెప్పాడు. ఆ కథలో ఓ అణుకువ లేని నర్సు, అణుకువ గల డాక్టరు ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరి ఉద్దేశం మంచిదే కానీ, అణుకువ ఉండటం వల్ల మిగతా వ్యక్తుల అభిమానాన్ని చూరగొనే అవకాశం ఏర్పడుతుంది. ఈ కథలో అదే జరిగింది.
ఎప్పుడూ రద్దీగా వుండే ఆ వీధిలో ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే చాలామంది జనం గుమిగూడారు. అందులోంచి ఓ మహిళ ప్రమాద బాధితుడికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ వారి దగ్గరగా వెళ్ళింది. ఆమె సహాయం చేస్తుండగానే, మరో మహిళ హడావిడిగా అక్కడికి వచ్చి ఆ మహిళను పక్కకు జరగమని చెప్పింది.
‘‘నేను ప్రథమ చికిత్స చేయడంలో తర్ఫీదు పొందిన నర్సుని. ఈ బాధితుడికి ప్రథమ చికిత్స చేసే స్థోమత నాకు ఉంది’’ అంటూ హడావిడి చేసింది. ఆమె హడావిడి చూసి ముందుగా వచ్చిన మహిళ వెనక్కి తగ్గింది.
రెండవ మహిళ ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయసాగింది. వెనక్కి తగ్గిన మహిళ ఆమె చికిత్స విధానాన్ని గమనించసాగింది.
ఓ ఐదు నిమిషాల తర్వాత ఆమె ఇలా అంది.
‘‘మీరు చేస్తున్న వైద్యవిధానం బాగానే వుంది. మీకు డాక్టర్ సహాయం అవసరమనిపిస్తే నా సేవలు ఉపయోగించుకోండి. నా కారులో మెడికల్ కిట్ కూడా వుంది’’
నర్సు ఆ మహిళవైపు విస్మయంగా చూసింది.
‘‘సారీ డాక్టర్, మీరు డాక్టర్ అని తెలియక నేను హడావిడి చేశాను. మీ సహాయం తప్పక అవసరమే’’ అని అంది.
‘‘పర్వాలేదు. మీరు చేస్తున్న చికిత్స విధానం బాగానే వుంది’’ అంది డాక్టర్
అక్కడ గుమిగూడిన జనాలందరు నర్సు చేసిన హడావిడిని, డాక్టర్ అణుకువని రెండింటిని గమనించారు. ఇద్దరూ చేస్తున్నది మంచి పనే అయినా డాక్టర్ పట్ల అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఆ విషయాన్ని ఆ నర్సు కూడా గమనించింది. తన తొందరపాటుతనాన్ని సరిదిద్దుకోవాలనుకుంది.
అణుకువగా వుండటం అనేది అందరికీ అన్నివేళలా అవసరం. కొన్ని సందర్భాలలో హడావిడి కూడా అవసరమే కానీ, ఎదుటి వ్యక్తులు ఎవరో కూడా గమనించాలి. అణుకువతో వుంటే ఎక్కువమందికి ప్రేమపాత్రులవుతాము. హడావిడి వల్ల అహంభావం వల్ల మనం చేస్తున్నది మంచి పని అయినా కూడా ఇతరుల అభిమానానికి పాత్రులం కాలేకపోతాము. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం వుంది. మనుషులందరితోనూ సరైన సంబంధాలు కలిగి వుండటానికి గర్వాన్ని, అహంభావాన్ని విడనాడటం చాలా అవసరం. మనలను ఆవరించుకొన్న గర్వం దుర్వాసన వేస్తూ మనుషుల్ని మనకు దూరం చేస్తుంది.