ఓ చిన్నమాట!

ఇంద్రజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయలు మంత్రాలు వున్న కథలని చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. ఆ కథల్లో మమేకం అవుతారు. మాయలు మంత్రాలు వున్న సినిమాలని ఇంకా ఇష్టపడతారు. వాటిల్లో ప్రధాన పాత్ర మంచితనంతో నిండి ఉంటుంది. ఎన్నో కష్టాలు పడుతుంది. కానీ చివరికి విజయం సాధిస్తుంది. అది రాజుల సినిమా కావొచ్చు. మామూలు వ్యక్తుల సినిమా కావొచ్చు.
అదే విధంగా రాక్షసుల బారి నుంచి, మాంత్రికుల బారి నుంచి ఓ యువకుడు తన రాజ్యాన్ని రక్షిస్తాడు. మంచి వాళ్లు విజయం సాధించడం, చివరికి మంచితనం గెలవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
మాయలు, మంత్రాలు పిల్లలని బాగా ఆకర్షిస్తాయి. అలాంటి మంత్రాలు తమకు కూడా వస్తే బాగుండునని అనుకుంటారు. ఆ మంత్రాలతో ఈ ప్రపంచాన్ని ఆనందమయంగా చేసేస్తామని అనుకుంటూ ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత మంత్రాలు మాయలు ఏవీ లేవన్న విషయం బోధపడుతుంది. అయినా అలాంటి సినిమాలని కథలని ఇష్టపడతారు. ఇది సహజం. ఈ ప్రపంచం ఆనందమయంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.
మా చిన్నప్పుడు శ్రీను అనే ఓ మిత్రుడు ఉండేవాడు. తనకి కూడా మంత్రాలు వస్తాయన్న ఆశతో ఉండేవాడు. వాళ్ల నాన్నకి ఓ చిన్న హోటల్ ఉండేది. తనకు మంత్రాలు వస్తే, పాతాళభైరవి సినిమాలో లాగా తనకి ఓ పాతాళభైరవి బొమ్మ దొరికితే ఆ చిన్న హోటలును పెద్ద హోటలుగా మారుస్తామని కలలు కనేవాడు.
కాస్త పెద్ద అయిన తరువాత మాయలు మంత్రాలు అనేవి ఏమీ లేవన్న విషయం అతనికి బోధపడింది. కష్టపడితేనే ఏదైనా సిద్ధిస్తుందన్న తత్వం కూడా అతనికి అర్థమైంది. కానీ అతని బీదతనంవల్ల ఎక్కువగా చదువుకోలేక పోయాడు. పెద్ద హోటల్ ఏర్పాటు చేయడం కష్టమై పోయింది.
కానీ కొద్ది రోజుల తరువాత అతను ఓ విభిన్నమైన ఇంద్రజాలంను కనుగొన్నాడు. ఆ ఇంద్రజాలం అతని ఆత్మలో పెరిగి పెద్దగా మారిపోయింది. రోజురోజుకి అది పెరిగి అతన్ని మించిపోయింది. అదే ‘ప్రేమ మంత్రం’. అతను అందరినీ ప్రేమించేవాడు. ఎవరినీ వదిలిపెట్టకుండా ప్రేమించే గుణం ఉండటం వల్ల అతను బాగా ధనికుడిగా మారిపోయాడు. ప్రేమించే గుణం వల్ల అతను అతనికి చాలా మంది సహాయం చేశారు. చివరికి మా ఊళ్లో అతను ఓ పెద్ద హోటల్ పెట్టాడు.
కథల్లో కన్పించే ఇంద్రజాలం నిజ జీవితంలో ఉండదు. కానీ ఆ ఇంద్రజాలం మనందరిలో ఉంటుంది. అది వున్న వాళ్లు ఎప్పుడూ బీదవాళ్లుగా కన్పించరు. దానే్న ‘ప్రేమ’ అంటారు. ప్రేమించే గుణం ఉన్నవాళ్లు ఎవరూ బీదవాళ్లు కారు. కాలేరు కూడా.
అందుకే ఈ ప్రేమ అనే ఇంద్రజాలాన్ని అందరూ పట్టుకోవాలి. దాన్ని ప్రవహింపజేయాలి. దాన్ని రోజూ పంచుతూనే ఉండాలి. ఇతరుల పట్ల దయతో ఉండటం అంటే ప్రేమతో ఉండటం. మన పట్ల మనం కూడా ప్రేమతో ఉండాలి. ఇతరులకి సహాయం చేయడం వల్ల ఇతరుల బాధని పూర్తిగా తొలగించకపోయినా కొంత తగ్గించగలం.
ప్రేమతో స్వర్గానికి నిచ్చెనలు వేయగలం.

- జింబో 94404 83001