S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర్తమానంలో గతం

గతంలోకి ప్రయాణించడం చాలామందికి అలవాటు. ప్రస్తుతం కన్నా గతం మధురమని చాలామంది తరచూ అనుకుంటూ వుంటారు. స్మృతులు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. చిన్నప్పటి ఆటలు, పాటలు, వేషాలూ గుర్తుకు తెచ్చుకొని ఆనందించడం సహజం. అయితే మనందరం మరిచిపోతున్న విషయం ఒకటి ఉంది. ఈ రోజు కూడా కొద్ది రోజులకి గతం అవుతుంది. ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల తరువాత ఓ మధుర స్మృతి అవుతుంది.
చిన్నప్పుడు టూరింగ్ టాకీసుల్లో సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూస్తున్నాం. అయినా అప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటాం. అందులో తప్పేమీ లేదు. అయితే ఎప్పుడూ గతంలోకే ప్రయాణం చేయకూడదు. భవిష్యత్తు గురించి భయపడకూడదు.
పెళ్లినాటి ఆల్బమ్ చూస్తే చాలు. అప్పుడు ఎంత అందంగా ఉన్నామూ, ఎంత బక్కగా ఉన్నామూ, తలనిండా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని ఆలోచిస్తూ ఆనందిస్తాం. ఇప్పుడు లావుగా అయినామని, అందం తగ్గిందని, వెంట్రుకలు పలుచబడి బట్టతల వచ్చిందని విచారిస్తూ ఉంటాం. కానీ ఓ విషయం మరిచిపోతున్నాం. ఈ రోజుకి ఫొటో కూడా కొంతకాలానికి అందంగా మారిపోతుంది. అందం తగ్గిన ముఖం మీద ముడుతలు పడుతాయి. పలచనైన తల పూర్తిగా బట్టతలగా మారిపోతుంది. అప్పుడు ఈ ఫొటోలని చూస్తూ మళ్లీ ఆలోచనల్లో పడుతాం. వర్తమానంలో గతంలోకి ప్రయాణిస్తూ ఉంటాం.
గతంలోకి ప్రయాణం చేయడంలో తప్పులేదు. కానీ వర్తమానంలో అందం లేదు. ఆనందం లేదని అనుకోవడం లోనే తప్పుంది. ఇప్పుడున్న అందాన్ని ఇప్పుడు మనలో చాలామంది గుర్తించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఓ పదేళ్ల తరువాత మనకు అందంగా మధురంగా కన్పిస్తుంది. ఆ విధంగా చూడ్డం ఎందుకు?
ఇప్పుడున్న పరిస్థితిని ఇప్పుడే మధురంగా అందంగా ఉందని చూస్తే ఇంకా ఎంత బాగుంటుంది. మనందరికీ అద్భుతమైన వర్తమానం ఉంది. దాన్ని గుర్తించడంలోనే ఆలస్యం జరుగుతుంది. వర్తమానంలో గతాన్ని చూడటం అలవాటు చేసుకుంటే వర్తమానం అందంగా కన్పిస్తుంది.

***
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001