ఓ చిన్నమాట!

బంగారు ఉంగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీ విద్యార్థులకి ప్రేరణ కలిగించడానికి ఓ గురువుని పిలిచారు.
కాస్సేపు చాలా విషయాలు విద్యార్థులతో మాట్లాడిన తరువాత తన జేబులో నుంచి ఓ బంగారు ఉంగరాన్ని తీసి పైకి ఎత్తి అందరికీ కన్పించేలా పట్టుకున్నాడు.
‘ఈ ఉంగరం ఎవరికి కావాలి?’ అడిగాడు.
ఎంతోమంది తమకి కావాలని చేతులెత్తారు.
కాస్సేపటి తరువాత ‘నాకు’ ‘నాకు’ అన్న మాటలు కూడా విన్పించాయి.
అక్కడున్న అంతమందిలో ఎవరు అదృష్టవంతులోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఆ బంగారు ఉంగరాన్ని గురువుగారు ఎందుకిస్తారని కొంతమందిలో అనుమానాలు మొదలయ్యాయి.
ఇంతలో ఓ యువతి వేగంగా వేదిక పైకి పరుగెత్తుకెళ్లి గురువు చేతిలో నుంచి ఆ ఉంగరాన్ని లాక్కుంది.
‘చాలా మంచి పని చేసావు అమ్మాయి’ అన్నాడు గురువు.
‘చాలామంది ఏదో మంచి మన జీవితంలో జరగాలని వేచి చూస్తుంటారు. దానివల్ల ఫలితం లేదు. వేచి చూడ్డం కాదు అది జరిగేలా చూడాలి’
ఏదో జరగాలని ఎదురుచూడ్డం వల్ల ఏమీ జరగదు.
మన జీవితంలోనూ అంతే! మన చుట్టూ ఎన్నో అవకాశాలు. మంచి కావాలని మనమందరం కోరుకుంటాం. కానీ సమస్య ఏమిటంటే అవి జరిగేలా మనం ప్రయత్నం చేయం.
మనందరికి బంగారు ఉంగరం కావాలి. కానీ మనం ఒక్క అడుగూ ముందుకు వేయం.
ఏదో జరగాలని చూడ్డం కాదు. అడుగు ముందుకు వేయండి. పనిలోకి దిగండి. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు.
(కోవే కథ ఆధారంగా)
***
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001