S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శబ్దార్థ అర్థాలు

భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం జరగడం అత్యంత సహజం. మాటల యుద్ధంలో ఎలాంటి పరిమితులు లేకుండా మాటలు జారుతూ ఉంటారు. కొంతమంది విడాకులు ఇవ్వాలని అంటే మరికొంత మంది పొరపాటున పెళ్లి చేసుకున్నామని అంటూ ఉంటారు. ‘నువ్వు ఛస్తే పీడ వదులుతుంద’ని మరి కొంతమంది అంటూ ఉంటారు. ఇలాంటి మాటల యుద్ధాలు భార్యాభర్తల మధ్యనే కాదు స్నేహితుల మధ్య కూడా జరుగుతుంటాయి.
ఇదే విధంగా పిల్లలు పరీక్షల్లో సరైన మార్కులు తెచ్చుకోనప్పుడు కూడా తల్లిదండ్రులు కోపంలో ఏవో మాటలని అంటూ ఉంటారు. అన్నాచెల్లెళ్ల మధ్య, అన్నాతమ్ముళ్ల మధ్య కూడా వాళ్ల చిన్నతనంలో ఎన్నో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు కూడా అనవసర మాటలు దొర్లుతూ ఉంటాయి.
భార్యాభర్తల్లో కొంతమంది చాలా సున్నిత మనస్కులు ఉంటారు. భార్య సున్నిత మనస్కురాలైతే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. భర్త సున్నిత మనస్కుడైతే అతను భార్యకు విడాకుల నోటీసు ఇచ్చేవరకు వెళతాడు. పిల్లలు కూడా చిన్ననాటి మాటలు గుర్తుకు తెచ్చుకొని తరచూ బాధపడుతూ ఉంటారు.
‘నువ్వు ఛస్తే పీడ వదలుతుంద’న్న మాటలకి ‘పొరపాటున పెళ్లి చేసుకున్నానని’ అన్న మాటలకి శబ్దార్థ ప్రకారం అర్థాలని తీసుకొని చాలామంది రోజూ బాధపడుతూ ఉంటారు. ఇది సరైంది కాదు.
ఈ మాటలు చేతనతో అన్నవి కాదు. వివేకంతో అన్నవి అంతకన్నా కాదు. అందుకని వాటిని శబ్దార్థ ప్రకారం స్వీకరించకూడదు. మా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన చెబుతాను.
మా ఇంటి దగ్గరలో వ్యవసాయ పనులు చేసుకునే ఓ కుటుంబం ఉండేది. వాళ్లకి ఇద్దరు మగపిల్లలు. ఇద్దరి మధ్య మూడు సంవత్సరాల దూరం ఉంది. పెద్దవాడికి ఏడు సంవత్సరాలు, రెండవ వాడికి ఐదు సంవత్సరాలు ఉంటాయి. రెండవ వాడు ఏదో ఒకటి కావాలని తల్లిని తరచూ విసిగించేవాడు. ఎప్పుడూ ఏడ్చి తనకు కావాల్సింది సాధించుకునేవాడు. ఒకరోజు తల్లికి విపరీతంగా కోపం వచ్చి పెద్ద కొడుకుతో ఇలా అన్నది - ‘వీడిని వాగులో బొందపెట్టి రా పోరా!’ అట్లా అని తన పనిలో నిమగ్నమైంది.
ఓ గంట తరువాత చూస్తే పెద్ద కొడుకు ఒక్కడే ఇంట్లో కన్పించాడు. రెండోవాడు కన్పించలేదు. విచారిస్తే ఆ తల్లికి తెలిసింది- పెద్దవాడు చిన్నకొడుకుని బొంద పెట్టి వచ్చాడని. ఆ తల్లి భయంతో పెద్ద కొడుకుని తీసుకొని వాగు దగ్గరికి పరుగెత్తింది. చిన్నకొడుకు ఏడుస్తూ కన్పించాడు.
అదృష్టవశాత్తు వాడిని పూర్తిగా బొంద పెట్టలేదు. గొంతు వరకే బొంద పెట్టి వచ్చాడు. వాడిని ఆ బొందలో నుంచి బయటికి తీసి వాడిని గుండెలకి హత్తుకొని ఏడుస్తూ పెద్దకొడుకుని రెండు దెబ్బలు కొట్టింది. మా చిన్నప్పుడు మా ఊళ్లో ఇది పెద్ద వార్త.
ఇప్పుడు చెప్పండి - తల్లి ఉద్దేశం నిజంగా అదేనా? కానే కాదు. మాటల యుద్ధంలో పేలే మాటల ఉద్దేశం ఎప్పుడూ అవి కానే కాదు. శబ్దార్థ ప్రకారం అర్థాలని అన్నిసార్లూ స్వీకరించకూడదు. స్వీకరించిన సున్నిత మనస్కులు మాదిరిగా చర్యలు తీసుకోకూడదు.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు
bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.