S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుండె

కొంతమంది నిరంతరాయంగా పని చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలాంటి వ్యాపకం లేకుండా కూర్చుంటూ ఉంటారు.
ఇంటి విషయానికి వస్తే అమ్మ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ నిద్ర లేవకు ముందు లేచి ఆమె పనిచేస్తూ ఉంటుంది. అందరూ పడుకున్న తరువాత ఆమె పని ముగుస్తుంది. ఆమెకు సెలవులు లేవు. ఆదివారాలు లేవు.
పని మనిషి రాకపోతే - ఇంకా ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. ఎవరో కొంతమంది పిల్లలు ఆమెకు అంతో ఇంతో సహాయం చేస్తూ ఉంటారు. చాలామంది ఆమె పని చేయడానికే ఉన్నట్టు భావిస్తూ ఉంటారు.
ఆమెను చూసి కూడా కొంత పని చేయాలని అనుకోరు. బాధ్యతగా ఫీల్ అవరు.
ఇంట్లోనే కాదు. మానవ శరీరంలో కూడా కొన్ని అవయవాలు నిరంతరం పని చేస్తూ ఉంటాయి. ఆ పనిని ఆ శరీర యజమాని గుర్తించడు. తన శరీరంలోని ఒక్క అవయవం అంతగా, నిరంతరాయంగా పని చేస్తూ ఉంటే దాని యజమాని అయిన అతను అలా ఎందుకు పని చేయడం లేదన్న విషయం గుర్తించడు. అలా పని చేస్తున్న అవయవానికి భారం కలిగించేలా ప్రవర్తిస్తాడు. చివరికి కష్టాలపాలు అవుతాడు.
మానవ శరీరంలోని గుండె నిరంతరాయంగా పని చేస్తూ ఉంటుంది. మనిషి ఈ ప్రపంచంలోకి రాకముందు నుంచి అది పని చేస్తూనే ఉంటుంది. అది పని చేయడం మానేసిన తరువాత మనిషి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాడు.
నిరంతరాయంగా పని చేస్తున్న తన గుండె చేస్తున్న శ్రమని కూడా మనిషి గుర్తించడు. గుర్తిస్తే తను కూడా గుండెలాగా పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
ప్రతి మనిషి నిరంతరాయంగా పని చేస్తున్న అమ్మని చూసి నేర్చుకోవచ్చు. అదే విధంగా అతని యాజమాన్యంలో వున్న గుండెని చూసి నేర్చుకోవచ్చు. కాని చాలామంది ఈ విషయాన్ని గుర్తించక ఎలాంటి పని చేయకుండా, మరి కొంతమంది కొంతసేపు మాత్రమే పని చేసి ఇక చాలు అని అనుకుంటూ ఉంటారు.
అమ్మకి వయస్సుతో నిమిత్తం లేదు. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. గుండె కూడా అంతే. తనకు వయస్సు వచ్చేసింది. ఇక తాను పని చేయను అని అనుకోదు.
అమ్మని, గుండెని జాగ్రత్తగా గమనించిన వ్యక్తులు తమ శక్తి వున్న మేరకు పని చేస్తూనే ఉంటారు. విశ్రాంతి అవసరమే. కానీ విశ్రాంతి మాత్రమే తీసుకుంటే ఎందుకూ పనికి రాకుండా పోతాం.

- జింబో 94404 83001