ఓ చిన్నమాట!

జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాతర’ అన్న పదం వింటే ఒళ్లు పులకరిస్తుంది. అది మేడారం జాతర కావొచ్చు. నాగోబా జాతర కావొచ్చు. మా వేములవాడ జాతర కావొచ్చు.
మా ఊరు వేములవాడ. రాజరాజేశ్వరు, రాజేశ్వరీదేవి కొలువు తీరిన ఊరు. శివరాత్రి వస్తుందనగానే ఊరు ఊరంతా సందడి పెరిగిపోతుంది. మా ఊళ్లో జాతర గ్రౌండ్ ఉంది. ఆ స్థలం దేవస్థానానికి చెందినది. అక్కడ దుకాణాల స్థలాన్ని కిరాయికి (అద్దెకి) ఇచ్చేవాళ్లు. అక్కడంతా దుకాణాలు వెలిసేవి. స్వీటు షాపులు, బొమ్మల దుకాణాలు, గాజుల దుకాణాలు, ఆడపిల్లలకి అవసరమైన వస్తువులు, అలంకరణ సామాగ్రి దొరికే దుకాణాలు, అత్తరు దుకాణాలు, శికాకాయ్ సాయిబు దుకాణాలు ఇట్లా ఎన్నో వచ్చేవి. ఇవే కాదు - రంగుల రాట్నాలు, మోటారు సైకిల్ ఫీట్లు చేసే గుడారాలు, కరెంటు అమ్మాయిలు సర్కస్‌లు ఇట్లా ఎన్నో వచ్చేవి.
జాతర రోజుల్లో నడవడం కూడా కష్టంగా ఉండేది. అయినా జాతర గ్రౌండ్‌కి వెళ్లి రావడం పిల్లలకే కాదు పెద్దవాళ్లకి కూడా సరదాగా వుండేది. అదొక గొప్ప అనుభవం.
మేడారం జాతర రెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఆ జాతర వున్న సంవత్సరం మా వేములవాడ మరింత సందడిగా ఉంటుంది. రాజేశ్వరుణ్ని దర్శించుకొని చాలామంది మేడారంకి వెళ్లేవాళ్లు. మరి కొంతమంది అక్కడి నుంచి వేములవాడకి వస్తారు. జనవరి నుంచి మార్చి నెల వరకు మా ఊరంతా సందడి సందడిగా ఉంటుంది. వేములవాడ జాతర నాగరీకులది. మేడారం జాతర గిరిజనులది. గిరిజనుల జాతరలోకి నాగరీకులని అనబడేవాళ్లు ప్రవేశించి గిరిజనులని ప్రకృతికి దూరం చేస్తున్నారు. వాతావరణానే్న కాదు.. వాళ్ల మనసులని కూడా కలుషితం చేస్తున్నారు.
ఈ రెండు జాతరలే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో గోండుల జాతర కూడా జరుగుతుంది. అది నాగోబా జాతర.
జాతరలు అంటే ప్రజల సమూహాలు. సుదూర ప్రాంతాలలో వున్న ప్రజలు, బంధువులు, స్నేహితులు కలుసుకోవడానికి ఉపయోగపడే సందర్భాలు.
ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. జాతరలని సరదాగా తీసుకుంటున్న నాగరీకులు ఎక్కువవుతున్నారు.
మా చిన్నప్పుడు జాతరలో పిల్లలు తప్పిపోయేవాళ్లు. వాళ్లని వెతికి పట్టుకునేవాళ్లు. ఆనవాళ్లు చెప్పి మైకుల్లో ప్రకటనలు చేసేవాళ్లు.
ఇప్పుడు జాతరలో పిల్లలు తప్పిపోవడం తగ్గిపోయింది. ఇప్పుడు మానవత్వం తప్పిపోతోంది.
అలా కాకుండా సమ్మక్క సారలమ్మలు ప్రయత్నం చేస్తారని ఆశ.

- జింబో 94404 83001