ఓ చిన్నమాట!

అవసరమైన దానికన్నా ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచిన్నప్పుడు మా టీచర్ ఒక్క లెక్కని మూడుసార్లు చేయించేవాడు. అలా ఎందుకు చేయించేవాడో అప్పుడు అర్థం కాలేదు. ఆయన ఒక్క మాట చెప్పేవాడు ‘అవసరమైన దానికన్నా ఎక్కువ చేయాలి’. ఆ మాట అర్థం చాలా రోజులకి అర్థం అయ్యింది.
మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు ఇంట్లో పాలు అయిపోయాయి. పాలపొడి డబ్బా కూడా లేదు. డబ్బులకి ఇబ్బంది లేదు. అవసరమైనన్ని పాలు మాత్రమే తీసుకున్నాం. ఎవరో అతిథులు రావడం వల్ల పాలు ఖర్చైపోయాయి. ఒక లీటర్ ఎక్కువగా ఎందుకు తీసుకోలేదు అని అన్పించింది. అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవే అవసరమైన దానికన్నా ఎక్కువ చేయాలి.
మనం ఊహించిన దానికన్నా ఏ పనైనా ఎక్కువ చేయాలి.
ఈ మధ్యకాలంలో కొన్ని ఫోన్‌కాల్స్ తరచూ వస్తూ ఉంటాయి. ప్లాట్లు వున్నాయి కొంటారాని కొంతమంది, క్రెడిట్ కార్డులు ఇస్తామని మరి కొంతమంది, లోన్లు ఇస్తామని ఇంకా కొంత మంది తరచూ ఫోన్లు చేస్తూ ఉంటారు. అలా ఫోన్లు రిసీవ్ చేసుకునే వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ వుంటారు.
కొంతమంది విసుక్కుంటారు.
కొంతమంది ఫోన్ పెట్టేస్తారు.
మరి కొంతమంది తిడతారు. ఇలా ఎన్నో రకాల స్పందనలని వాళ్లు స్వీకరిస్తూ వుంటారు. అయినా కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ ఫోన్లు వాళ్లు చేస్తూనే ఉంటారు. చివరికి ఎవరో ఒకరు వాళ్ల వ్యాపారాన్ని స్వీకరిస్తారు.
ఇది ఒక వ్యాపారస్థులకే కాదు అందరికీ వర్తిస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చేయాలి.
అవసరమైన దానికన్నా ఎక్కువగా భార్య పట్ల ప్రేమని ప్రకటించాలి. ఇది భార్యలకు కూడా వర్తిస్తుంది.
జీవితంలో విజయం సాధించాలంటే అవసరమైన దానికన్నా ఎక్కువ పని చేయాలి.
విద్యార్థులు విజయం సాధించాలంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చదవాలి.
పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు వాళ్లతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
మా లెక్కల టీచర్ చెప్పింది ఇదే! అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది.