ఓ చిన్నమాట!
కుక్కపిల్ల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కుక్కల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో నేర్చుకోకూడనివి కూడా అనే్న ఉన్నాయి.
చిన్నప్పుడు మా ఇంట్లో ఓ చిన్న కుక్క ఉండేది. దానితో ఆడుకోవడం గొప్ప సరదాగా ఉండేది. దాని మెడకు ఓ గొలుసు వేసి ఎప్పుడన్నా దాన్ని బయటకు తీసుకొని వెళ్లేవాళ్లం. ఓ రోజు మా మేనమామతో కలిసి మా పెంపుడు కుక్కని తీసుకొని బయటకు వెళ్లాను.
దానికి పరిశీలన శక్తి ఎక్కువగా వుండేది. అయితే ఏ చిన్న వస్తువు కన్పించినా దాని దృష్టి చెదిరిపోయేది. చిన్నచిన్న వాటిని చూసి అది తన దృష్టిని మరల్చేది.
ఓ చిన్న కాగితం కన్పించినా దాని దగ్గరికి వెళ్లి వాసన చూసి మళ్లా ఇంకోవైపు తన దృష్టిని కేంద్రీకరించేది.
అవసరమైన దాన్ని అవసరం లేని దాన్ని అది పట్టించుకునేది. వాసన చూసేది. అటూ ఇటూ పరుగెత్తేది. నిలకడగా మా వెంట నడిచేది కాదు.
మా మేనమామతో కలిసి వెళ్లిన రోజు కూడా మా కుక్క అలాగే ప్రవర్తించింది. క్షణక్షణం అటూ ఇటూ వెళ్తూ తిరిగి మా వైపు వచ్చేది.
కుక్కని పరిశీలించిన మా మేనమామ నన్ను ఓ ప్రశ్న వేశాడు.
‘ఈ కుక్కను చూస్తే నీకు ఏమి అర్థమవుతుంది?’
నాకేం జవాబు చెప్పాలో తోచలేదు. వౌనంగా ఉండిపోయాను.
చివరికి ఆయనే ఇలా చెప్పాడు.
‘ఆ కుక్కలా ప్రతి చిన్నచిన్న విషయానికి నీ దృష్టి చెదిరిపోకూడదు. నువ్వు ప్రక్కదారి పట్టకూడదు. అటూ ఇటూ అవసరం లేని వాటివైపు చూస్తూ నీ పని పాడు చేసుకోవద్దు.
నీ దృష్టిని నీ పని మీద కేంద్రీకరించాలి. నీ పని పట్ల నువ్వు క్రమశిక్షణతో వుండాలి. ఆ రకంగా నువ్వు పనిచేస్తే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. చదువు విషయంలోనే కాదు. అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది.’
ఆయన ఈ విషయం చెప్పినప్పుడు ఆయన చెప్పింది అంతగా అర్థం కాలేదు. కాస్త పెద్దగా అయిన తరువాత ఆయన చెప్పిన విషయం పూర్తిగా బోధపడింది.
ఏ కుక్కపిల్లను చూసినా మన పని మీద దృష్టి కేంద్రీకరించాలన్న మా మేనమామ మాటనే గుర్తుకొస్తుంది.