ఓ చిన్నమాట!

శబ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవిలో ఓ మహావృక్షం విరిగి పడిపోయింది. అప్పుడు విపరీతమైన శబ్దం వచ్చింది. అయితే చుట్టుపక్కల ఎవరూ లేరు. కనీసం జంతువులు కూడా లేవు. మరి అది పడిపోయినప్పుడు శబ్దం వచ్చినట్టా? రానట్టా? ఈ విషయాన్ని పూర్వకాలంలో తత్త్వవేత్తలు ఎక్కువగా చెప్పేవారు.
ఈ విషయం పూర్వకాలం కన్నా ఇప్పుడే ఎక్కువగా అవసరం అన్పిస్తుంది. చాలా సంఘటనలని మనం నిశితంగా గమనించినప్పుడు ఈ విషయం బోధపడుతుంది.
ఈ మధ్య ఓ జంట వచ్చారు. వారి మధ్య చిన్నచిన్న విభేదాలు. మాటల్లో నేను గ్రహించిన విషయం ఏమిటంటే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. ఇద్దరిలో భర్తకి భార్య అంటే ఎక్కువ ఇష్టం. అయితే అతను ఎప్పుడూ ఆ విషయాన్ని వ్యక్తీకరించేవాడు కాదు. అప్పుడప్పుడు మన ప్రేమను వ్యక్తీకరించాలని అతనికి వ్యక్తిగతంగా చెప్పి ఇద్దరిని సమాధానపరిచి పంపించాను. ప్రేమ వుండడం ఒక ఎత్తు. దాన్ని ప్రకటించడం మరో ఎత్తు.
అదే విధంగా మరో మిత్రుడికి ఇద్దరు పిల్లలు. వాళ్లంటే అతనికి పిచ్చి ప్రేమ. కానీ ఎన్నడూ వాళ్లని దగ్గరికి తీసుకుని మాట్లాడక పోయేవాడు.
మనలో కొంతమంది ఉంటారు. వాళ్లకి గొప్పగొప్ప ఆలోచనలు వస్తాయి. కానీ వాటిని ఎవరికీ చెప్పకుండా వాళ్లలోనే దాచుకుంటారు.
ఎంత గొప్ప ప్రేమ అయినా అది వ్యక్తీకరించకపోతే ఫలితం వుండదు.
మనలో ఎంత గొప్ప ఆలోచన వచ్చినా దాన్ని ఎవరికీ చెప్పకపోతే ఫలితం ఉండదు. అదే విధంగా ఆలోచనని అమలు చేయకపోతే ఫలితం శూన్యం.
మంచి కథ రాసినా అది చదివే వాళ్లు లేకపోతే అది మంచి కథగా పరిగణించబడదు.
ఇలాంటి విషయాలు గమనించినప్పుడు పూర్వకాలంలో తత్త్వవేత్తలు మాట్లాడుతున్న మాటలు గుర్తుకొస్తాయి.
అడవిలో వుండే మహావృక్షం విరిగి పడిపోయింది. అప్పుడు విపరీతమైన శబ్దం వచ్చింది. అయితే చుట్టుపక్కల ఎవరూ లేరు. కనీసం జంతువులు కూడా లేవు. మరి అది పడిపోయినప్పుడు శబ్దం వచ్చినట్టా? రానట్టా? సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటివే ప్రేమలు, ఆత్మీయతలు, ఆలోచనలు, కథలు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.
అవి అడవిలో పడిన చెట్టులా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

- జింబో 94404 83001