ఓ చిన్నమాట!

సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపెద్ద లక్ష్యాలు నిర్దేశిస్తే ప్రయాణం కొనసాగదు. మనకు కన్పించే, మనం అందుకునే అవకాశం వున్న లక్ష్యాలు నిర్దేశించుకుంటే మనం ఆ పనిని సాధించుకునే అవకాశం ఉంటుంది.
ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలన్న లక్ష్యాన్ని మనం నిర్దేశించుకుంటే మొదలు చిన్నచిన్న కొండలు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. మొదట చిన్న లక్ష్యాలు వుండాలి. చిన్నప్పుడు పెద్దవాళ్లు ఓ ఆట ఆడించేవాళ్లు. ఓ వెదురుబొంగుకు ఐదారు జిలేబీలు తాడుకు కట్టి వ్రేలాడదీసేవారు. పిల్లల ఎత్తునుబట్టి వాటిని వ్రేలాడదీసేవారు. ఆ వెదురుబొంగు ఇద్దరు పెద్దవాళ్లు పట్టుకొని అందుకొమ్మని చెప్పేవాళ్లు. అవి ఆ పిల్లలకి దగ్గరలో పెడితేనే పిల్లలు అందుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్లు. అవి దూరంగా పెడితే వాళ్లు అందుకునే ప్రయత్నం చేసేవారు కాదు.
మన జీవితంలో మనం పెట్టుకునే లక్ష్యాలు కూడా మనం చేరుకునేవిగా ఉండాలి. అతి పెద్ద లక్ష్యాలు పెట్టుకోవద్దని కాదు. ఉదాహరణకి ఎవరెస్టు శిఖరం ఎక్కాలన్న లక్ష్యం పెట్టుకుంటే దానికి ముందు ఈ పనులు చేయాల్సి ఉంటుంది.
* చిన్నచిన్న శిఖరాలను ఎక్కే ప్రయత్నం చేయాలి.
* మన పనితనం, నైపుణ్యం వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు నిరంతర సాధన చేయాలి.
* మీకు సహాయం అందించే టీంను తయారుచేసుకోవాలి.
* మీకు మార్గ నిర్దేశనం చేసే వ్యక్తిని కూడా ఎంచుకోవాలి.
* శిఖరాలని ఎక్కడానికి అవసరమైన సామర్థ్యాలని అలవర్చుకోవాలి.
* మన పని మీద మన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించాలి.
ఎవరెస్టు అనేది ఒక ఉదాహరణ. ఏ పనికైనా ఇది వర్తిస్తుంది. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.
పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం మంచిదే. అయితే ముందుగా చిన్న లక్ష్యాలు సాధించాలి. మన ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.
పెద్ద లక్ష్యాలని క్షణాల్లో, రోజుల్లో సాధించలేం. కాని అందుకు తగిన ప్రయత్నం చేస్తే సరైన సమయంలో సాధించగలం.
సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు పెద్దలు.

- జింబో 94404 83001