ఓ చిన్నమాట!

ధనస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువ. పనిభారంతో అవి ఒత్తిడికి గురవుతున్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ న్యాయస్థానాల్లో విపరీతమైన పనిభారం. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.
విడాకుల కోసం వస్తున్న వ్యక్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఆర్థిక స్వాతంత్య్రం ఎక్కువగా ఉండటంవల్ల ఈ సంఖ్య పెరుగుతోందా? బంధాలని అర్థం చేసుకోకపోవడం వల్ల పెరుగుతుందాన్న విషయం పరిశోధించాల్సిందే.
కొంతకాలం నేనూ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా పని చేశాను. నా అనుభవం ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఎక్కువగా కోర్టుకి రావడం గమనించాను. చిన్నచిన్న విషయాల మీద అభిప్రాయ భేదాలు. వాటిని భూతద్దంలో చూసి, ఎక్కువగా ఆలోచించి కోర్టు దాకా వచ్చేవాళ్లు. కోర్టుకు వచ్చే పార్టీలతో మాట్లాడి వారి వివాదాలని పరిష్కరించే అవకాశం ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా ఉంటుంది. ఆ కోర్టుల ఉద్దేశం కుటుంబ వ్యవస్థను పరిరక్షించడం. కానీ పనిభారం వల్ల ఆ దిశగా పనిచేసే పరిస్థితి లేకుండా పోతుంది.
నేను ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నప్పుడు నా గదిలో ధనస్సు, బాణం వేలాడి ఉండేవి. న్యాయదేవత బొమ్మ కాకుండా ధనస్సు బాణం వేలాడి ఉండటం చాలామందికి ఆశ్చర్యం వేసేది.
భార్యాభర్తలతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్లు ఆ ధనస్సు, బాణం వైపు ఆశ్చర్యంగా చూసేవాళ్లు. వాళ్ల కళ్లల్లో దానికి సంబంధించిన ప్రశ్న కన్పించేది. వాళ్లు వెళ్లిపోయే ముందు ఆ ధనస్సు గురించి వాళ్లకు వివరించేవాడిని.
భార్యాభర్తలు అనే వ్యక్తులు ఈ ధనస్సు లాంటివారు. ఒకరు విల్లు అయితే మరొకరు వింటినారి. అవి రెండూ కలిస్తేనే ధనస్సు అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే కుటుంబం అవుతుంది. అహం అనేది బాణం లాంటిది. బాణం అనేది వింటినారిని లాగుతుంది. అప్పుడు విల్లు వంగుతుంది. వింటినారిని కొంత లాగితే విల్లు కొంతే వంగుతుంది. ఈ రెండింటిలో ఎవరు భార్యా ఎవరు భర్తా అనేది చెప్పే అవకాశం లేదు. ఒక్కోసారి ఒక్కొక్కరు ఆ పాత్రని పోషిస్తారు.
ఒకసారి భర్త విల్లు పాత్రలో ఉంటే భార్య వింటినారి పాత్రలో ఉంటుంది. భర్త వింటినారి పాత్రలో ఉంటే భార్య విల్లు పాత్రలో ఉంటుంది. అహం అనేది వింటినారిని లాగుతుంది. అప్పుడు విల్లు అవసరమైన మేరకు వంగుతుంది. భార్యాభర్తలు కూడా ఈ ధనస్సులా ఉండాలి. భార్య లాగినప్పుడు భర్త వంగిపోవాలి. భర్త లాగినప్పుడు భార్య వంగిపోవాలి. అంతేకానీ విల్లూ వింటినారి ఎప్పుడూ వేరు కావు. కలిసే ఉంటాయి.
ఈ వివరణ చాలా మందికి నచ్చేది. చిన్నచిన్న అభిప్రాయ భేదాలు వున్నవాళ్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని బయటకు వెళ్లేవాళ్లు. మరి కొంతమంది ఆలోచనల్లో పడేవాళ్లు. చూసే దృష్టి ఉంటే ప్రతి వస్తువు నుంచి ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఈ ధనస్సు భార్యాభర్తలకే కాదు అన్ని సంబంధాలకి వర్తిస్తుంది.

====================
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు,
రచనలు, కార్టూన్లు, ఫొటోలు
bhoomisunday@deccanmail.comకు
కూడా పంపించవచ్చు.

=======================

-జింబో94404 83001