S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృతజ్ఞత

ఓ దేవత నాకు స్వర్గం చూపిస్తున్నట్టుగా కల వచ్చింది. చాలామంది దేవతా స్ర్తిలు పనిచేస్తూ కన్పించారు.
మేం చూస్తున్న మొదటి ప్రాంతం రద్దీగా కన్పించింది. ఎంతోమంది దేవతా స్ర్తిలు తమకు వచ్చిన దరఖాస్తులను సరిచేస్తూ కన్పించారు. వాళ్లు చాలా పని వత్తిడిలో వున్నట్టు కన్పించారు. లెక్కలేనన్ని దరఖాస్తులు కన్పించాయి.
అక్కడి నుంచి రెండో ప్రాంతానికి వెళ్లాం. అది కూడా పెద్ద గది.
‘ఇది ప్యాకేజీ బట్వాడా సెక్షన్. దీవెనలను, అనుగ్రహాలను ఇక్కడ ప్యాక్ చేసి భూమీద అవి కోరుకున్న వ్యక్తులకి బట్వాడా చేస్తారు’ నా కుతూహలాన్ని చూసి ఆ దేవతా మూర్తి నాకు వివరించింది.
అక్కడున్న దేవతలు కూడా చాలా పని వత్తిడిలో కన్పించారు. చాలా మంది దేవతలు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంటే ఎంతోమంది దీవెనలని, అనుగ్రహాలని అడుగుతున్నారు. వాటిని భూమి మీదకు పంపిస్తున్నారు.
చివరికి మేం మరో పెద్ద హాల్లోకి వెళ్లాం. అక్కడ ఒకే ఒక్క దేవతా స్ర్తి కన్పించింది. ఏమీ పనిలేదు. ఖాళీగా కూర్చొని కన్పించింది.
‘ఇది స్వీకరించే సెక్షన్’ చెప్పింది దేవతా స్ర్తి నాతో.
‘ఇక్కడ ఏమీ పని జరుగుతున్నట్టు లేదే?!’ అడిగాను.
‘అవును. ప్రజలు స్వర్గం నుంచి దీవెనలు, అనుగ్రహాలని పొందిన తరువాత అవి అందినట్టుగా చెప్పరు. చాలా కొద్దిమంది మాత్రమే చెబుతారు. అందుకే ఇది బోసిపోయినట్టుగా ఉంటుంది’ బాధగా చెప్పింది.
‘దేవుడికి ఏ రకంగా దీవెనలు, అనుగ్రహాలు అందినట్టుగా చెబుతారు’ అమాయకంగా ప్రశ్నించాను.
‘అది చాలా సింపుల్. కృతజ్ఞతలు భగవంతుడా అని చెబితే సరిపోతుంది’ జవాబు చెప్పింది ఆమె.
ఎవరు ఏ సహాయం చేసినా, కరుణించినా కృతజ్ఞతలు తెలియజేయాలి. అది పెదవుల మీద నుంచి కాదు. హృదయం నుంచి రావాలి.

-జింబో 94404 83001