ఓ చిన్నమాట!

కోడిగుడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా క్లాస్‌మేట్స్ చాలామంది రూంలు తీసుకొని కరీంనగర్‌లో చదువుకునేవారు. అప్పుడు ఇన్ని హాస్టల్స్ లేవు. అందుకని వాళ్లు రూంలలో ఉండేవాళ్లు. వంట వాళ్లే వండుకునేవాళ్లు. నాకు అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే కరీంనగర్‌లో మా రాధక్క ఉండేది. ఆమె దగ్గర ఉండటం వల్ల వంట అన్నది అవసరం పడలేదు.
యూనివర్శిటీకి వచ్చిన తరువాత వంట అనేది నాకు ఎదురు కాలేదు. యూనివర్శిటీలో హాస్టల్ ఉండేది. అందుకని వంట సమస్య ఎదురుకాలేదు.
న్యాయవాదిగా మారడం పెళ్లి కావడం ఒకేసారి జరగడంవల్ల వంట నేర్చుకునే పరిస్థితి అప్పుడూ ఎదురుకాలేదు. ఆ తరువాత న్యాయమూర్తి ఉద్యోగంలోకి మారడం వల్ల ఆ పరిస్థితి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ఉద్యోగంలో వుండే సౌకర్యాలలో వంట మనిషి ఉండటం అన్నింటికన్నా ముఖ్యమైన సౌకర్యం. కొన్నిసార్లు ఒంటరిగా ఉండే పరిస్థితి వున్నా వంట నేర్చుకునే పరిస్థితి ఏర్పడలేదు.
ఇదే పరిస్థితి మా బాబుకి వచ్చింది. వాడు చదువుకున్నప్పుడు మా దగ్గర ఉండటం లేదా హాస్టల్లో వుండటం జరిగింది. అందుకని వంటింట్లోకి వెళ్లే పరిస్థితి వాడికి కలుగలేదు. కానీ ఎం.ఎస్. చదవడం కోసం వాడు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బతకాలంటే వాడి వంట వాడే చేసుకోవాలి. అందుకని అక్కడ వంట నేర్చుకోవడం మొదలు పెట్టాడు.
మొదటిసారిగా అన్నం వండినప్పుడు అది పేస్టులాగా మారిందట. పప్పులో పప్పు గింజలు ఎక్కడా కన్పించలేదట. యూ ట్యూబ్‌లోని వంటలు వాడికి చాలా సహకరించాయి. వంట నేర్చుకోవాలన్న అభిలాష అమెరికాలో తీరింది. అక్కడ వంట అవసరమైంది. వంట చేయడానికి అక్కడ వాడికి ఎలాంటి అడ్డంకులు లేవు. మామూలు అన్నమే కాదు చైనీస్ రైస్, నార్త్ ఇండియన్ రైస్, బిర్యానీ ల్లాంటివి ఎన్నో అలవోకగా చేస్తున్నాడు. మేం మొన్న అమెరికా వెళ్లినప్పుడు వాడి వంట రుచి కూడా చూపించాడు.
కోడిగుడ్డుని బయట నుంచి పగలగొట్టడం చాలా సులువు. లోపల నుంచి పగలగొట్టడం కష్టంతో కూడుకున్న పని. అదే విధంగా బయట నుంచి లోపల ప్రభావితం చేయడం చాలా కష్టమైన పని. లోపలి నుంచి పగలకొట్టడానికి మనకు గురువు అవసరం అవుతాడు.
కోడిగుడ్డుని లోపల నుంచి పగులగొడితే విజయం వరిస్తుంది. అట్లా కాకుండా బయట నుంచి పగులకొడితే ఎందుకూ పనికిరాకుండా పోతుంది. మనకున్న అడ్డుగోడలని మనమే తొలగించుకుంటే విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
జీవితంలో ఎన్నో అడ్డుగోడలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని మనమే తొలగించుకోవాలి. ఇతరులు తొలగించినప్పుడు ఆ విజయం అంత గొప్పగా ఉండదు.
జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అవి మనుషుల మధ్య సంబంధాలు కావొచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవడం కావొచ్చు. చేయాలని అనుకున్నది వెంటనే చేయాలి.
ప్రతిరోజు కోడిగుడ్డును గుర్తుకు తెచ్చుకోవాలి.
కర్తవ్యం బోధపడుతుంది.
వంట అన్నది ఓ ఉదాహరణ మాత్రమే.

-జింబో 94404 83001