ఓ చిన్నమాట!

రెండు తోడేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మా అమ్మాయి ఆల్బమ్ తిరగేస్తుంటే నేను ఓ మీటింగ్‌లో పాల్గొన్న ఫొటో కనిపించింది. నా పక్కన ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. అతను కాళ్లు బాగా చాపి కూర్చున్నాడు. ‘ఇంత నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తి ఎవరు?’ అని మా అమ్మాయి అడిగింది. ఆ కుర్రవాడు చాలా మంచివాడని చెప్పడానికి కొంత సమయం పట్టింది. పుస్తకం అట్టని చూసి పుస్తకాన్ని అంచనా వేయడం ఏ విధంగా సరైంది కాదో, మనిషి కూర్చున్న విధానం గురించి ఆ వ్యక్తిని అంచనా వేయడం కూడా సరైంది కాదు. కానీ శరీర భాష కూడా మంచిగ ఉండటం అవసరమే. శరీర భాష బాగుంటే ఇలాంటి అభిప్రాయానికి రావటానికి అవకాశం ఉండదు.
ఎవరి గురించైనా నెగెటివ్‌గా ఆలోచించడం ఎంత సరైంది కాదో పూర్తిగా పాజిటివ్‌గా కూడా ఆలోచించడం సరైంది కాదు. అయితే నెగెటివ్‌గా ఆలోచించడం మంచిది కాదు. మనుషుల గురించే కాదు ఏ విషయం గురించైనా పాజిటివ్‌గా ఆలోచించాలి. అందుకే మన పెద్దవాళ్లు తథాస్తు దేవతలు ఉంటారని అంటారు. తథాస్తు దేవతలు వున్నారో లేదో తెలియదు గానీ ఎప్పుడూ మంచిని తలచుకోవాలని, ఆశావహ దృక్పథంతో ఉండాలన్నది మన పెద్దవాళ్ల ఉద్దేశం.
ప్రతి మనిషిలోనూ నెగెటివ్ అంశాలు, పాజిటివ్ అంశాలు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ఈ విషయం గురించి అంతర్జాలంలోని ఓ కథను మా బాబు నాకు పంపించాడు.
ఆ కథలో ఓ తండ్రి కొడుక్కి ఓ కథ చెబుతాడు. మన శరీరంలో రెండు తోడేళ్లు ఉంటాయి. అవి ఎప్పుడూ ఒకదానితో మరొకటి కొట్లాడుతూ ఉంటాయి. ఒక తోడేలు వ్యతిరేక భావనలతో ఉంటుంది. ఆ తోడేలుకు ఈర్ష్యాద్వేషాలు, అసూయ ఎక్కువగా ఉంటాయి. కోపం దురాశ కూడా ఎక్కువగా ఉంటాయి. రెండవ తోడేలు ఆశావహ దృక్పథంతో ఉంటుంది. దానికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సంతోషం, ఆనందం ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండూ మనలో తరచూ పోట్లాడుతుంటాయి. తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు.
ఆ కొడుక్కి ఆరేడు సంవత్సరాలు ఉంటాయేమో. అతను అమాయకంగా తండ్రిని ఇలా అడుగుతాడు.
‘నాన్నా! ఆ రెండు తోడేళ్లలో ఏ తోడేలు గెలుస్తుంది?’
‘మనం ఏ తోడేలుకు ఎక్కువ ఆహారం ఇస్తే ఆ తోడేలు గెలుస్తుంది’ తండ్రి జవాబు చెబుతాడు.
ఆ కుర్రవాడికి ఆ తండ్రి చెప్పిన జవాబు అర్థమైందో కాలేదో తెలియదు కానీ పెద్దవాళ్లందరికీ ఆ తండ్రి చెప్పిన విషయం అర్థమయ్యే ఉంటుంది. మనందరిలో ఈ రెండు తోడేళ్లు నిరంతరం కొట్లాడుతూనే (యుద్ధం) చేస్తూనే ఉంటాయి.
ఏ తోడేలుకు మనం ఆహారం ఇవ్వాలో అర్థం చేసుకొని, పాటిస్తే జీవితం సుగమం అవుతుంది. సంతోషానికి, ఆనందానికి మధ్యన వంతెన నిర్మిస్తుంది.

-జింబో 94404 83001