ఓ చిన్నమాట!

చివరి గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికా మిత్రులు ఎక్కువగా ఉపయోగించే పదం డెడ్‌లైన్. తెలుగులో దాన్ని మనం చివరి గడువు అంటాం. పత్రికలో ఆదివారం అనుబంధం పేజీలు ముగించడానికి ఓ చివరి గడువు ఉంటుంది. అదే విధంగా ప్రతీ పత్రికకి చివరి గడువు ఉంటుంది. వార్తలకి కూడా చివరి గడువు ఉంటుంది. ఆ చివరి గడువు తరువాత పత్రిక ప్రచురణకి వెళ్లిపోతుంది. సంపాదకీయానికి అంతే. చివరి గడువు లేనిదంటూ ఏమీ ఉండదు. ఆ చివరి గడువు తరువాత ఆ వార్తకి విలువ ఉండదు. ఆ వ్యాసం ఆ రోజు వచ్చే అవకాశం ఉండదు.
చివరి గడువు దగ్గర పడుతున్నప్పుడల్లా ఆ మనస్సు చురుగ్గా పని చేస్తుంది. మెదడు జాగరూకతతో ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు చురుగ్గా కదులుతాయి. ఆలోచనలు కేంద్రీకృతం అవుతాయి. ఎవరో కొంతమంది చివరి గడువుని చూసి నిరుత్సాహపడతారు. ఆందోళనకి గురవుతారు. ఒత్తిడికి లోనవుతారు. చేతులు ఎత్తేస్తారు. ధైర్యవంతులు చివరి గడువును ధైర్యంగా ఎదుర్కొంటారు.
పరీక్షల తేదీ ప్రకటించిన తరువాత చాలా మంది విద్యార్థులు తీవ్రంగా చదువుతారు. ఎవరో కొంతమంది చేతులు ఎత్తేస్తారు. ఇంత తీవ్రంగా కొంతకాలం ముందు చదివితే ఎంత బాగుండేదని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది సహజం.
డెడ్‌లైన్ సమీపిస్తున్న కొద్దీ మెదడు చురుగ్గా పని చేస్తుంది. అయితే ఆ పని ఆ సమయానికి తప్పనిసరై ఉండాలి. అది తప్పనిసరైనది కానప్పుడు ఆ పనిని చాలామంది వదిలివేస్తారు.
ఈ చివరి గడువుని మన జీవితానికి వర్తింప చేసుకోవాలి. అలా వర్తింపజేసుకుంటే పనుల్లో జాప్యం ఉండదు. వాయిదా ఉండదు. ప్రతిరోజూ ఉదయం లేవగానే మనం బతికి వున్నందుకు ఆనందంతో కేకవేయాలి. భూమికి దండం పెట్టాలి. పంచభూతాలకి రెండు చేతులు జోడించి ప్రార్థన చేయాలి.
మన తల మీద ఎవరైనా గన్ పెడితే మన మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది. ఏ విధంగా బయటపడాలో ఆలోచిస్తాం. మన జీవితంలో ప్రతి గడియ చివరి ఘడియ కాదు. కానీ చివరి ఘడియ అని అనుకొంటే చేయాల్సిన పనులు వాయిదా వేయం. చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీక్షతో ఆ పనులు చేస్తాం.
ప్రతి డెడ్‌లైన్‌ని చివరి ఘడియతో పోల్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. దాన్ని ఉత్సాహంగా స్వీకరిస్తాం.
ప్రతిరోజూ, ఇంకా చెప్పాలంటే ప్రతి ఘడియా మనకు చివరి గడువే. ఇది గుర్తుంచుకొంటే అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తాం.

-జింబో 94404 83001