ఓ చిన్నమాట!

మాటలో మర్యాద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ రెండు సంవత్సరాల క్రితం ఓ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. అది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. చాలా రాష్ట్రాలకి చెందిన కవులూ రచయితలు పాల్గొంటున్న కార్యక్రమం.
పాల్గొంటున్న కవులు తమ కవితలని తమ మాతృభాషలో, అదే విధంగా దాని అనువాదాన్ని ఇంగ్లీషులో చదవాలి. మాతృభాషేతరులకి అర్థం కావాలి కాబట్టి అలా చదవాలని కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు ఆ విధంగా కోరారు. అది సరైంది కూడా. పాత కవితలు చదవడం ఇష్టంలేక కొత్త కవితలని రాశాను. వాటిని ఇంగ్లీషులోకి తర్జుమా చేయమని ఓ మిత్రున్ని కోరాను. అనువాదం చేసి ఇవ్వండి అని సమాచారం పెడుతూ కవితలని ఈమెయిల్ ద్వారా పంపించాను. అతనికి ఇంగ్లీషులో మంచి పట్టు ఉంది.
ఆ సాహిత్యకారుడు తెల్లవారే అనువాదం చేసి నాకు మెయిల్ చేసి నాకు ఓ సంక్షిప్త సమాచారం పంపాడు. దాని సారాంశం ఇది ‘ఎవరినైనా ఏదైనా కోరినప్పుడు కొంచెం మర్యాదగా అడగాలి యువరానర్!’ నేను న్యాయమూర్తిని కాబట్టి ఆ మిత్రుడు ఆ విధంగా యువరానర్ అని సంబోధించాడు. కవితలు ఇంగ్లీషులోకి అనువాదం అయి వచ్చాయి అన్న సంతోషంకన్నా ఆయన నాకు పెట్టిన సంక్షిప్త సమాచారం నన్ను ఎక్కువగా కలవరపెట్టింది. అతను నాకు బాగా తెలిసిన సాహిత్యకారుడే. కానీ సన్నిహితుడు కాదు. నేను మర్యాదపూర్వకంగా అతన్ని అడుగలేదానని మళ్లీ నా సంక్షిప్త సమాచారాన్ని చూశాను. ‘ఓ రెండు కవితలు అనువాదం చేసి ఇవ్వండి’ అది నా సమాచారం. దయచేసి రెండు కవితలు అనువాదం చేసి ఇవ్వగలరా అని నేను అడుగలేదు. ఆ విధంగా అడగాల్సి ఉండాల్సిందేమోనని నాకు అన్పించింది. అనువాదం చేసి ఇవ్వండి అని అడగటంలో ఏమైనా అధికార దర్పం కన్పించిందేమోనని అన్పించింది. కానీ నా ఉద్దేశం అది కాదు. వెంటనే జవాబు సంక్షిప్త సమాచారం ఈ విధంగా ఇచ్చాను. ‘్భవిష్యత్తులో ఆ విధంగానే చేస్తాను. ఈసారికి మన్నించండి.’
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంగ్లీషులో కొన్ని పదాలు ఉన్నాయి. చాలామంది మనస్సులో లేకున్నా వాళ్లు ఆ పదాలని తరచూ వాడుతూ ఉంటారు. ప్లీజ్, థాంక్యూ లాంటివి. మనం ఇతరుల దగ్గర నుంచి సహాయాన్ని అర్థిస్తున్నప్పుడు ఆ పదాలని వాడటం చాలా మంచిది. సహాయం అర్థించనప్పుడు కూడా ఆ పదాలను వాడటం మంచిదే.
మన మనస్సులో మంచి భావమే వున్నప్పటికీ వాటిని వ్యక్తపరిచేటప్పుడు మంచి భావంతోనే వ్యక్తపరచాలి. మరీ ముఖ్యంగా రాతలో వున్నప్పుడు మరీ జాగ్రత్తగా రాయాల్సి ఉంటుందని అన్పించింది. ఏమైనా నన్ను కొంత ట్యూన్ చేసిన మిత్రునికి సదా కృతజ్ఞుడినే!

-జింబో 94404 83001