ఓ చిన్నమాట!

అభిప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ రకరకాలైన వ్యక్తులని మనం చూస్తూ ఉంటాం. రకరకాల మనుష్యులు మనకు తారసపడుతూ ఉంటారు. అందులో కొంతమంది మనకు సన్నిహితులు ఉండవచ్చు. కొద్దిపాటి పరిచయం వున్న వాళ్లు వుండవచ్చు. ఇంకా కొంతమంది అపరిచితులూ ఉండవచ్చు.
అపరిచితులని చూసి వాళ్లమీద ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. వాళ్ల మాటలను బట్టి, వాళ్ల హావభావాలను బట్టి, మాటల సరళిని బట్టి వాళ్ల మీద ఒక రకమైన అభిప్రాయాలు ఏర్పడుతాయి. కొంతమందిని చూడకుండానే ఒక రకమైన అభిప్రాయం ఏర్పరచుకుంటాం. అది మంచి అభిప్రాయం కావొచ్చు. చెడు అభిప్రాయం కావొచ్చు.
మరి కొంతమందిని చూసి మాత్రమే ఒక రకమైన అభిప్రాయాలు వ్యక్తపరచుకుంటాం. అయితే ఈ అభిప్రాయాలు స్థిరంగా ఉండకూడదు. మనం అనుకున్నట్టు చెడ్డవాళ్లు కావొచ్చు. కాకపోవచ్చు.
ఈ మధ్య జరిగిన ఓ సంఘటన గురించి చెబుతాను. ఓ బిల్డర్ దగ్గర ఓ విల్లా చూశాను. నచ్చింది. స్థల యజమానికి చెందినది. ఆ యజమానిని నేను చూడలేదు. అతనూ నన్ను చూడలేదు. ఒప్పందం అయిపోయింది. రెండు మాసాల్లో ఒప్పందం పూర్తి కావాలి. బ్యాంక్ లోన్ మంజూరు చేయడంలో ఓ నెల ఆలస్యం అయ్యింది.
ఆ యజమాని ఓ రోజు ఫోన్ చేశాడు. మూడవ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పాను. ఆ రోజు రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోతే రిజిస్ట్రేషన్ కాన్సిల్ చేస్తానని చెప్పాడు. నాతో అంత కరకుగా మాట్లాడిన వ్యక్తులు ఎవరూ లేరు.
అనుకున్నట్టు మూడవ తేదీన రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వచ్చాను. బిల్డర్ ఉద్యోగితోపాటూ ఆ విల్లా యజమాని కూడా వచ్చాడు. మొదటిసారి అతను నన్ను చూడటం. అతన్ని చూడటమే నాకు ఇష్టం లేదు. కాని తప్పదు. దగ్గర కొచ్చి శుభాకాంక్షలు చెప్పాడు. కరకుగా మాట్లాడినందుకు క్షమాపణలు కోరాడు. ఇంకా బ్యాంకు ఇవ్వాల్సిన 15 శాతం డబ్బులు కొంచెం ఆలస్యం అయినా ఫర్వాలేదని చెప్పాడు. మిగతా పని బిల్డర్ జాప్యం చేయకుండా పూర్తి చేయిస్తానని చెప్పాడు.
మేమిద్దరం కలుసుకున్న తరువాత మా ఇద్దరి అంచనా మారిపోయింది. అప్పటివరకూ అతనిపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అతని మాటల ద్వారా అతని మీద ఏర్పడిన అభిప్రాయం, అతని ప్రవర్తన ద్వారా మారిపోయింది. కలయిక ద్వారా కూడా అభిప్రాయాలు మారతాయి.

-జింబో 94404 83001