S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/14/2016 - 17:05

హైదరాబాద్: ప్రలోభాలకు గురిచేసి ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటూ సిఎం కెసిఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. అనైతిక ఫిరాయింపులను జనం సైతం అసహ్యించుకుంటున్నారన్నారు.

06/14/2016 - 17:05

హైదరాబాద్: తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె యోచనకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు స్వస్తి పలికారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డితో మంగళవారం జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లకు ఆమోదం లభించింది.

06/14/2016 - 17:04

హైదరాబాద్: ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇక్కడి రాజ్‌భవన్‌లో మంగళవారం రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. రాజ్‌భవన్‌లో వివిధ విభాగాలకు చెందిన 200 మంది రక్తదానం చేశారు.

06/14/2016 - 17:03

తిరుపతి: నిజామాబాద్‌లో అన్నమయ్య భవనాన్ని నిర్మించాలని మంగళవారం ఇక్కడ జరిగిన టిటిడి పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. వివిధ ప్రాంతాల్లో పురాతన ఆలయాల పునరుద్ధరణకు, కల్యాణమండపాల నిర్మాణానికి నిధులను కేటాయించేందుకు సమావేశంలో తీర్మానించారు. తలనీలాల విక్రయం ద్వారా గత ఏడాది 5కోట్ల రూపాయలకు పైబడి ఆదాయం వచ్చిందని టిటిడి ఇఓ సాంబశివరావు తెలిపారు.

06/14/2016 - 17:03

హైదరాబాద్: ఎపిలో స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం తగదని టి.సచివాలయ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ సచివాలయంలో మంగళవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈమేరకు వారు అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రాంతం వారిని తెలంగాణ నుంచి పంపేయాలని వారు డిమాండ్ చేశారు. తమ నిరసన తెలిపేందుకు బుధవారం సచివాలయం వద్ద ధర్నా చేసే ఆలోచన ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

06/14/2016 - 16:47

హైదరాబాద్‌: ప్రభుత్వ పరంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని. రంజాన్‌ ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రంజాన్‌ ఏర్పాట్లపై ఆయన అధికారులతో మంగళవారం సమీక్షించారు.

06/14/2016 - 14:52

హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కాంగ్రెస్‌ను వీడితే పార్టీకి ప్రమాదమేమీ లేదని, అయితే ఆ ఇద్దరూ పదవులను వదులుకుని తెరాసలో చేరాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. తెరాస తరఫున పోటీ చేసినా ఈ ఇద్దరూ గెలవలేరని, గుత్తాపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

06/14/2016 - 14:52

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎవరికీ పోలియో వైరస్ సోకలేదని, కేవలం ప్రాథమిక పరీక్షలో పోలియో వైరస్ బయటపడిందని తెలంగాణ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మంగళవారం తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈనెల 20 నుంచి వారం రోజులపాటు పోలియో డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.

06/14/2016 - 14:51

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం అభివృద్ధి ముసుగులో అనైతిక ఫిరాయింపులు జరుగుతున్నాయని సిఎల్‌పి నేత జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత స్వార్థంతోనే కొందరు కాంగ్రెస్ నేతలు తెరాసలోకి వలసపోతున్నారని, అభివృద్ధిని ఆశించే పార్టీ మారుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు.

06/14/2016 - 14:50

హైదరాబాద్: ఆస్తిపన్ను బకాయిలను చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని, సకాలంలో పన్ను చెల్లించినట్టయితే నగదు బహుమతులు అందజేస్తామని జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఇక్కడ మంగళవారం జరిగిన జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. జూలై 11న హరితహారం సందర్భంగా నగరంలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటుతామని, పచ్చదనం-పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Pages