తెలంగాణ

గుత్తాపై పోటీకి సిద్ధం: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కాంగ్రెస్‌ను వీడితే పార్టీకి ప్రమాదమేమీ లేదని, అయితే ఆ ఇద్దరూ పదవులను వదులుకుని తెరాసలో చేరాలని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. తెరాస తరఫున పోటీ చేసినా ఈ ఇద్దరూ గెలవలేరని, గుత్తాపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల తెరాసలో చేరుతున్నట్లు వీరు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపిలో ఉన్నపుడు గుత్తా అందరితోనూ విభేదిస్తూనే ఎంపీగా గెలవాలన్న ఆశతో కాంగ్రెస్‌లో చేరారని కోమటిరెడ్డి గుర్తుచేశారు.