S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/14/2016 - 14:49

హైదరాబాద్: ఆస్తిలో వాటాకోసం భార్య ఇంటి ముందు భర్త ఆమరణ దీక్ష ప్రారంభించిన ఘటన కూకట్‌పల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లిలో ఉంటున్న రమేష్‌చంద్ర తన ఆస్తిపాస్తులన్నింటినీ భార్య పేరున రాశాడు. ఆస్తి రాశాక తనను ఇంటినుంచి భార్య వెళ్లగొట్టి అక్రమ కేసుల్లో ఇరికించిందని అతను వాపోతున్నాడు. భర్త ఆమరణ దీక్ష ప్రారంభించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

06/14/2016 - 12:21

వరంగల్: తెలంగాణలో చేపడుతున్న డిండి, పాలమూరు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు గతంలోనే అనుమతులున్నాయని, తాము కొత్తగా ఏ ప్రాజెక్టునూ చేపట్టలేదని మంత్రి హరీష్‌రావు మంగళవారం తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టుకు, కృష్ణా రివర్ బోర్డుకు ఎపి సిఎం చంద్రబాబు లేఖలు రాశారన్నారు. ఎలాంటి లేఖలు రాయలేదని చంద్రబాబు చెప్పినపుడు తాము వాటిని తప్పకుండా బహిర్గతం చేస్తామన్నారు.

06/14/2016 - 12:10

నిజామాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తమ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే ఉంచాలని మద్నూర్ మండల ప్రజలు మంగళవారం బంద్ పాటించారు. తమ మనోభావాలను గౌరవించకుండా జిల్లాల విభజనలో అన్యాయం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.

06/14/2016 - 07:01

మహబూబ్‌నగర్, జూన్ 13: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు వారం రోజుల్లో పరిహారాన్ని చెల్లిస్తామని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల బాటలో భాగంగా సోమవారం ఆయన కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించి నిర్వాసితులతో ముఖాముఖి భేటీ అయ్యారు.

,
06/14/2016 - 07:00

నల్లగొండ టౌన్, జూన్ 13: నల్లగొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెనె్సస్‌డేలో ముగ్గురు మహిళలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగడం కలకలం సృష్టించింది.

06/14/2016 - 06:56

భద్రాచలం, జూన్ 13: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మడకం ఇడమా అనే మహిళా మావోయిస్టు మృతి చెందింది. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోంపాడు గ్రామం వద్ద కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

06/14/2016 - 06:56

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 13: అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్న డిసిటివో (డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్) ఇదిగాని యుగేందర్‌ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని అతని భార్య ఇదిగాని రాజకుమారి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో బాధితురాలితో పాటు ఆమె తండ్రి బండి సమ్మయ్య మేనమామతో కలసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

06/14/2016 - 06:54

తొగుట, జూన్ 13: మల్లన్నసాగర్ ప్రాజెక్టకు భూములు రిజిస్ట్రేషన్ చేసిన వారిని గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా వారికి ఎవరూ సహకరింకూడదని ఆ గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్‌లో సోమవారం జరిగింది. మల్లన్నసాగర్ నిర్మాణం వద్దని గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు భూములు ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ చేశారు.

06/14/2016 - 06:47

విజయవాడ, జూన్ 13: అమరావతికి ఉద్యోగులు తరలివచ్చే ప్రక్రియకు కౌంట్‌డౌన్ ప్రారంభమవడంతో ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి తాజాగా విధివిధానాలు జారీ చేసింది. సిఎస్ టక్కర్‌తో సోమవారం జరిగిన సమావేశంలో సిఎం చంద్రబాబు క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి పొద్దుపోయాక విధివిధానాలను విడుదల చేశారు.

06/14/2016 - 06:46

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు.

Pages