S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/15/2016 - 14:18

హైదరాబాద్: అధిక ఫీజులు తగ్గించాలని తాము అడిగితే స్కూల్ యాజమాన్యం 27 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇళ్లకు పంపేసిందని తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో మాతా అమృతానందమయి స్కూల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫీజులు తగ్గించాలంటూ కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్య ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంగా వాగ్వివాదం చోటు చేసుకుంది.

06/15/2016 - 14:18

హైదరాబాద్: తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఐటి రంగానికి సంబంధించి మంచి వృద్ధి రేటును సాధించామని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆయన బుధవారం 2016 వార్షిక ఐటి ప్రణాళికను ఆవిష్కరించారు. బహుళజాతి సంస్థలు త్వరలోనే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడతాయని, సిలికాన్ వ్యాలీలో తెలంగాణ ఐటి హబ్ అవుట్ పోస్టును ప్రారంభిస్తామన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటి సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

06/15/2016 - 14:17

నల్గొండ: ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తున్న నిర్వాసితులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. భూములను కోల్పోయే రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

06/15/2016 - 14:17

హైదరాబాద్: తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం నగరంలోని గాంధీభవన్‌లో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, సలహాదారు కొప్పుల రాజు హాజరయ్యారు. తెరాసలోకి ఫిరాయింపులు, క్రమశిక్షణ చర్యలు, పార్టీ వ్యవస్థ నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

06/15/2016 - 14:16

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును త్వరితగతిన విభజించాలని కోరుతూ తెలంగాణ బిజెపి నేతలు గవర్నర్ నరసింహన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు నాయకత్వంలో బిజెపి నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

06/15/2016 - 14:15

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి నిబంధలకు విరుద్ధంగా ప్రవేశించి ప్రయాణీకులను బలవంతంగా ఎక్కించుకుని అధిక చార్జీలను వసూలు చేస్తున్నందుకు అయిదుగురు టాక్సీ డ్రైవర్లను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి టాక్సీలను, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/15/2016 - 14:15

హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాలని, తమకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టి.సచివాలయంలో ఉద్యోగులు బుధవారం ధర్నా చేశారు. ‘ఆంధ్రా ఉద్యోగులూ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.

06/15/2016 - 12:21

ఖమ్మం: మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నందుకు ఏభై మంది గిరిజన పోడు రైతులను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లెందు మండలం మిట్టపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

06/15/2016 - 12:21

వరంగల్: విధులకు గైర్హాజరవుతున్న మంగపేట ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్‌ను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం హెచ్‌ఎంను సస్పెండ్ చేసేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.

06/15/2016 - 12:18

ఆదిలాబాద్: తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుపై ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సారంగాపూర్ మండలం జామ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ ప్రవర్తన పట్ల విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.

Pages