S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/16/2016 - 13:55

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వం బ్రోకర్లతో కుమ్మక్కై రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటోందని మాజీ మంత్రి డికె అరుణ ఆరోపించారు.

06/16/2016 - 13:54

హైదరాబాద్: భూ సేకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 123 జీవో వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు అన్నారు. నగరంలోని గాంధీభవన్‌లో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ భూ సేకరం చట్టంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు.

06/16/2016 - 13:54

హైదరాబాద్: రాజేంద్రనగర్ వద్ద మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌లో గురువారం ఉదయం అర్చన అనే ప్రైవేటు టీచర్‌ను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్చన కోసం గాలింపుచర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

06/16/2016 - 13:53

దిల్లీ: తెలంగాణలో మరో నగరాన్ని స్మార్ట్‌సిటీల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు సంబంధించి ఇదివరకే హైదరాబాద్, వరంగల్ నగరాలను ఆ జాబితాలో చేర్చారు. పలువురు ప్రజాప్రతినిధుల అభ్యర్థనల మేరకు కరీంనగర్‌ను కూడా స్మార్ట్‌సిటీగా కేంద్రం గుర్తించింది.

06/16/2016 - 13:53

హైదరాబాద్: నగరంలో చైన్‌స్నాచర్లు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో ఆరుచోట్ల మహిళల నుంచి వీరు గొలుసులు కాజేశారు. తుకారాం గేట్, అడ్డగుట్ట, కర్మన్‌ఘాట్, బోయిగూడ ప్రాంతాల్లో ఆరుగురు మహిళలు చైన్‌స్నాచర్ల బారిన పడ్డారు. దీంతో రోడ్డుపై ఒంటరిగా నడిచివెళ్లాలంటేనే మహిళలు జంకుతున్నారు.

06/16/2016 - 12:46

హైదరాబాద్: యుపిఎ ప్రభుత్వ హయాంలో 2013లో కేంద్రం ఆమోదించిన భూ సేకరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టి.కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడి గాంధీభవన్ గురువారం అవగాహనా సదస్సును నిర్వహించారు. పార్టీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

06/16/2016 - 12:45

వరంగల్: వరంగల్ జిల్లాలో జనగామ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఉద్యమం తీవ్రతరం అవుతోంది. జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గురువారం స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. షాపులు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు మూసివేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకుంటే విభిన్న రూపాల్లో ఉద్యమం ఉద్దృతం చేస్తామని ఆందోళనకారులు తెలిపారు.

06/16/2016 - 08:17

బాసర, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి క్షేత్రం మొదటి గ్రామంగా నిలిచింది. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక్కో విద్యార్థి చొప్పున 460 మందికి డిజిటల్ అక్షరాస్యతలో పట్టాలను అందజేశారు.

06/16/2016 - 08:16

హైదరాబాద్, జూన్ 15: వినాయక చవితి వచ్చిందంటే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకోని వారుండరు. కానీ ఈసారి ఈ విగ్రహం ఎత్తు ఎంత అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఏటా విగ్రహం ఎత్తును 17 అడుగులకే పరిమితం చేయాలని ఇప్పటికే పోలీసులు ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది.

06/16/2016 - 06:58

హైదరాబాద్, జూన్ 15: దేశంలోనే రెండో అతి పెద్ద జాతీయ పతాకానికి అవస్థ వచ్చిపడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ తీరాన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద జాతీయ జెండా పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటైంది. ఏర్పాటు చేసి వారం గడవకముందే దీని నిర్వహణ ఆగమ్యగోచరంగా తయారైంది.

Pages