S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/13/2016 - 17:21

హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాలూ తనకు సమానమేనని, ఆంధ్రాకే పరిమితం కావాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడినని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఇక్కడ జరిగిన టి.టిడిపి నేతల భేటీలో అన్నారు. హైకోర్టు విభజన, నీటి పథకాల విషయంలో తనను టిఆర్‌ఎస్ టార్గెట్ చేస్తోందన్నారు. వౌలిక సౌకర్యాలు కల్పించి హైకోర్టును విభజించాలని తాను కేంద్రానికి గతంలోనే విజ్ఞప్తి చేశానన్నారు.

06/13/2016 - 16:04

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాకు చెందిన మడివిదేవి, సంగీతకర్ణ లొంగిపోయినట్లు భద్రాచలం ఏఎస్పీ భాస్కర్‌ సోమవారం తెలిపారు.

06/13/2016 - 14:27

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ వద్ద ప్రభుత్వ మానసిక వైద్యశాలలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఓ మహిళారోగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. ఆమె ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

06/13/2016 - 14:26

హైదరాబాద్: తెలంగాణ టిడిపి నాయకులతో ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. మహానాడులో చేసిన తీర్మానాలు, తెలంగాణలో పార్టీ పటిష్టతకు వ్యూహం, తెరాసలోకి వలసలు, తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై ఆయన చర్చించారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

06/13/2016 - 12:34

హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ అడ్వకేట్ జెఎసి పిలుపు మేరకు సోమవారం న్యాయవాదులు ‘చలో హైకోర్టు’ ఆందోళనకు దిగారు. లాయర్ల ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని, హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

06/13/2016 - 12:34

హైదరాబాద్: నిబంధనలను పాటించని స్కూల్ బస్సులను గుర్తించేందుకు ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్‌టిఎ) అధికారులు సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించారు. సరైన అనుమతి పత్రాలు లేకున్నా, శిక్షణ లేని డ్రైవర్లు ఉన్నా సంబంధిత బస్సులను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. కండిషన్‌లో లేని బస్సులను నడపవద్దని వారు విద్యాసంస్థలకు హుకుం జారీ చేశారు.

06/13/2016 - 12:34

హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం ఎపి, తెలంగాణల్లో సోమవారం ఉదయం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో స్కూళ్ల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి కనిపించింది. పిల్లలు బడికి వెళ్లడం తమకు ఆనందం కలిగించినా మరోవైపు అధిక ఫీజులు, పుస్తకాల ధరలు, ఇతర ఖర్చులకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానె్వంట్లు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

06/13/2016 - 07:16

మహబూబ్‌నగర్, జూన్ 12: ప్రాజెక్టులు పూర్తి అయితే మహబూబ్‌నగర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలను మించిపోతుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల కంటే తీవ్ర నష్టానికి గురైన మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి చెందాలంటే కృష్ణాజలాలు ఇక్కడి భూముల్లో పారాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

06/13/2016 - 07:14

హైదరాబాద్, జూన్ 12: పోలింగ్ కేంద్రం, గ్రామ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నిర్ణయించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది.

06/13/2016 - 07:13

హైదరాబాద్, జూన్ 12: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందు ఏమైనా లోపాలు ఉన్నాయా?

Pages