తెలంగాణ

స్థానిక నేతలకు శిక్షణా తరగతులు టి.పిసిసి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: పోలింగ్ కేంద్రం, గ్రామ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం నిర్ణయించింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నెలాఖరులోగా మండల, నియోజకవర్గాల కమిటీల నియామకాలను పూర్తి చేసుకోవాలని భావించారు. ఆ తర్వాత స్థానిక సంస్ధల నేతలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లకు, ఆ తర్వాత ఎంపిటిసి, సర్పంచులకు, జెడ్‌పిటిసీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
నాకే నోటీసు ఇస్తారా?
ప్రశ్నించిన మృత్యుంజయం
ఇలాఉండగా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సమావేశంలో తన పట్ల అనుచితంగా మాట్లాడిన టిపిసిసి ఎస్‌సి విభాగం చైర్మన్ ఆరేపల్లి మోహన్‌పై తాను పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తే, తనకూ షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కల్పించుకుని అది నోటీసు కాదని, ఈ నెల 17న క్రమశిక్షణా సంఘం ముందు హాజరై ఆ రోజున ఏమి జరిగిందో వివరణ ఇవ్వాలని చెప్పేందుకే నోటీసు ఇవ్వడం జరిగిందని నచ్చజెప్పారు. దీంతో కటకం మృత్యుంజయం శాంతించారు.