S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/12/2016 - 06:22

హైదరాబాద్, జూన్ 11:తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. అటవీ, పర్యావరణ అనుమతులపై శనివారం గచ్చిబౌలిలోని పర్యావరణ పరిరక్షణ పరిశోధన సంస్త సదస్సు నిర్వహించారు.

06/12/2016 - 06:21

హైదరాబాద్, జూన్ 11: ‘తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఇచ్చిందో లెక్కలతో వస్తాం, మీరూ లెక్కలతో రండి, ప్రజల ముందు బహిరంగంగా చర్చిద్దాం..’ అని బిజెపి ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఎన్. రఘునందన్ రావు టిఆర్‌ఎస్ నాయకులకు, రాష్ట్ర మంత్రులకు సవాల్ విసిరారు.

06/12/2016 - 06:21

హైదరాబాద్, జూన్ 11: అత్యంత వెనుకబడిన 32 సంచార, అర సంచార జాతుల వారి కోసం మొదటిసారిగా ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందుకు కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు. వెనుకబడిన కులాల వారి కన్నా అత్యంత దయనీయమైన జీవితాన్ని గడిపే సంచార జాతుల అభ్యున్నతి కోసం ఇలాంటి కృషి ఏనాడో జరిగి ఉండాల్సిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

06/12/2016 - 06:20

నక్కలగుట్ట (వరంగల్), జూన్ 11: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్ష ఫలితాలను ఇన్‌చార్జి ఉపకులపతి చిరంజీవులు విడుదల చేశారు. శనివారం కెయు సెనేట్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మార్చిలో జరిగిన డిగ్రీ వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించారు. ఈ వార్షిక పరీక్షలకు 233984 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, 224638 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.

06/11/2016 - 11:56

మహబూబ్‌నగర్: ఆత్మకూరు మండలం అమరచింతలో శుక్రవారం అర్ధరాత్రి అయిదు దుకాణాల్లో చోరీలు జరిగాయి. దీంతో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

06/11/2016 - 11:54

హైదరాబాద్: నగరంలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్‌ఖాన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ భవనం శ్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

06/11/2016 - 11:53

హైదరాబాద్: ఇక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు సోదా చేసి సుమారు కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందినవాడని, అతని లగేజీని తనిఖీ చేయగా 3.26 కిలోల బంగారం లభించిందని అధికారులు తెలిపారు.

06/11/2016 - 11:52

హైదరాబాద్: ఇక్కడి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాన్ని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్ చేశారు. సాంకేతిక లోపం వల్లే విమానాన్ని వెంటనే కిందకు దించారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణీకులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయడంతో విమానానికి ప్రమాదం తప్పిందని సమాచారం.

06/11/2016 - 11:51

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు నగరంలోని ఇందిరాపార్కు వద్ద శనివారం ఉదయం మహాధర్నా ప్రారంభించారు. ఇంటర్నేషనల్, టెక్నో, మోడల్ స్కూల్ అంటూ కార్పొరేట్ సంస్థలు అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

06/11/2016 - 06:43

మహబూబ్‌నగర్, జూన్ 10: ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కృష్ణా పుష్కర ఘాట్ల పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏకంగా 32 ఘాట్లను ఏర్పాటు చేశారు. మరో 20 ఘాట్లను లోకల్ ఘాట్లుగా గుర్తించారు.

Pages