తెలంగాణ

ప్రాజెక్టులు పూర్తయితే.. గోదావరి జిల్లాలు దిగదుడుపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 12: ప్రాజెక్టులు పూర్తి అయితే మహబూబ్‌నగర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలను మించిపోతుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల కంటే తీవ్ర నష్టానికి గురైన మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి చెందాలంటే కృష్ణాజలాలు ఇక్కడి భూముల్లో పారాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు మహబూబ్‌నగర్ జిల్లాను వెనుకకు నెట్టేశారని, ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లడానికి కారకులయ్యారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలోని రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. బీమా లిఫ్ట్-2, ఫేజ్-2 పనులను తనిఖీ చేశారు. భీమా లిఫ్ట్-2 మోడల్‌ను పరిశీలించడమే కాకుండా పంప్‌హౌస్ పనులను తనిఖీ చేశారు. శంకర సముద్రం రిజర్వాయర్ పనులను స్టేజ్-2ను తనిఖీ చేసి అధికారుల నుండి వివరాలు సేకరించారు. నాగరాల పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కూడా ఆరా తీశారు. శ్రీరంగపూర్ వద్ద ఉన్న కాలువపై హెడ్‌రెగ్యులేటర్ పనులను మంత్రి పరిశీలించారు. జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను కూడా ఆయన పరిశీలించారు. సంగంబండ, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కొన్ని పనులను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌ను ఆయన ఆదేశించారు. అనంతరం మంత్రి జూపల్లి విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వచ్చే జూలై 31 నాటికి జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లోనే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోనే తనతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టుల బాటపట్టామని పనుల పురోగతి భేషుగ్గా ఉందన్నారు. మూడున్నర ఏళ్లల్లో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు ఎన్ని కొంగజపాలు వేసినా జగన్ దొంగదీక్షలు చేసినా, తమ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును నిర్మించి తీరుతుందని జూపల్లి స్పష్టం చేశారు.

చిత్రం రాజీవ్ భీమా ప్రాజెక్టు రెగ్యులేటర్, ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు