S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/12/2016 - 06:41

కమాన్‌పూర్, జూన్ 11: రాష్ట్రంలోని రైతులకు 900 సొసైటీల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో వివిధ రకాల విత్తనాలను పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

06/12/2016 - 06:40

నందిపేట, జూన్ 11: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో శనివారం పాడుబడిన దాబా గోడకూలి నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనలో జోర్‌పల్లికి చెందిన ఏడె రమాదేవి (17), గొట్టుముక్కులకు చెందిన నీరడి అఖిల (15) దుర్మరణం చెందగా, సంఘటనలో తీవ్రంగా గాయపడిన వెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్, సుదర్శన్‌లను ఆసుప్రతికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

06/12/2016 - 06:38

భద్రాచలం, జూన్ 11: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసులు, నక్సల్స్ మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోరు జరుగుతోంది. ఇరు వర్గాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. రెండు రోజుల క్రితమే మావోయిస్టులు కొండగావ్ జిల్లాలో రాకెట్ లాంఛర్లతో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసుల క్యాంపుపై విరుచుకు పడ్డ సంగతి విదితమే.

06/12/2016 - 06:35

నల్లగొండ, జూన్ 11: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆ పార్టీ ప్రతిష్టను రచ్చకెక్కిస్తోంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు..షోకాజ్‌ల నోటీస్‌ల జారీలతో సాగిస్తున్న రచ్చ జిల్లా కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తోంది.

06/12/2016 - 06:33

హైదరాబాద్, జూన్ 11: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి, టి.పిసిసి ఎస్‌సి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్‌కు టి.పిసిసి క్రమశిక్షణా సంఘం తాఖీదు పంపించింది. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడినందుకు ఈ నెల 17వ తేదీన గాంధీ భవన్‌కు వచ్చి తమకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం. కోదండ రెడ్డి వారిరువురికి శనివారం నోటీసులు జారీ చేశారు.

06/12/2016 - 06:32

హైదరాబాద్, జూన్ 11: విద్యుత్ రంగంలో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని, తెలంగాణకు ఎలాంటి సహాయం చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రైవేటు విద్యుత్‌ను యూనిట్‌కు 4.63 రూపాయల నుంచి 5.30 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తోందని తెలిపారు. అదే కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఎన్‌టిపిసి మాత్రం యూనిట్‌కు పది రూపాయలు వసూలు చేస్తోందని విమర్శించారు.

06/12/2016 - 06:26

ఎల్లారెడ్డిపేట, జూన్ 11: కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని గంభీరావుపేట మండలం పెద్దమ్మ అడవుల్లో గుట్టుగా సాగుతున్న ఎముకల నూనె తయారీ కేంద్రంపై నాలుగు రోజుల కిందట వరంగల్ జోనల్ ఆహార నియంత్రణ అధికారి ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు నిర్వహించిన దాడులు పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎముకల నూనె తయారీ వ్యవహారాన్ని ‘ఆంధ్రభూమి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం విదితమే.

06/12/2016 - 06:24

ఖమ్మం, జూన్ 11: కొత్త జిల్లాల ఏర్పాటు అనేక మందికి ఆనందం కలిగిస్తున్నా కొందరికి మాత్రం నిరాశ కలిగిస్తోంది. గంపెడాశలతో కొందరు నేతలు అనుభవిస్తున్న పదవులు కొత్త జిల్లాల ఏర్పాటుతో కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

06/12/2016 - 06:23

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 22 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో సమ్మెకువెళతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన మంత్రి జగదీశ్వరరెడ్డి సమక్షంలో చర్చలు జరుగుతాయని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేత శంకర్ తెలిపారు.

06/12/2016 - 06:23

హైదరాబాద్, జూన్ 11: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళలో సాధించింది శూన్యమని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. పైగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

Pages