S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/11/2016 - 06:40

కరీంనగర్, జూన్ 10: పరిపాలన ప్రజలకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో జిల్లాల పునర్వీభజన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే ప్రజలు ఏలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని, ప్రజా అంగీకారం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 70 కిలోమీటర్ల పరిధిలో 20 నుంచి 22 మండలాలను ఒక జిల్లాను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

06/11/2016 - 06:38

కేశంపేట, జూన్ 10: ప్రజలందరి సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి దత్తత గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గ్రామస్థులు, యువకులతో చర్చించారు.

06/11/2016 - 06:35

జనగామ టౌన్, జూన్ 10: వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలతో పాటు జిల్లా సాధన సమితి ప్రతినిధులు చౌరస్తాలో నినాదాలు చేస్తుండగా వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

06/11/2016 - 06:09

హైదరాబాద్, జూన్ 10: కంచ ఐలయ్య షెపర్డ్ బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ, బాధ్యతారాహిత్యంగా ప్రపంచానికే గర్వకారణమైన హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నందున, తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మిన్ యూనిటీ ఫరెవర్, బ్రాహ్మణ సంఘ నేతలు తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మను కోరారు. ఈ మేరకు ద్రోణంరాజు రవికుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

06/11/2016 - 06:07

హైదరాబాద్, జూన్ 10: మరో ఐదునెలల్లో కొత్త జిల్లాలు ఉనికి లోకి రానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలు పని చేస్తాయని ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. జిల్లాలు ఏర్పడినా, కొన్ని జిల్లాలకు మంత్రులు లేని విచిత్రమైన పరిస్థితి ఏర్పడబోతోంది. జిల్లాలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేది జిల్లా మంత్రే. జిల్లా మంత్రికి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయిస్తున్నారు.

06/11/2016 - 04:12

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీకి హైదరాబాద్ ఫార్మాసిటీ అని పేరు పెట్టింది. ఫార్మా సిటీ ఏర్పాటుకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ భూమి లభ్యతనుబట్టి ఫార్మా సిటీ సరిగ్గా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో ప్రకటిస్తారు.

06/11/2016 - 04:10

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం నెరవేరని హామీల్లో సిఎం మొక్కులు కూడా చేరిపోయాయి. తెలంగాణ ఏర్పడితే ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రలోని ప్రసిద్ధ దేవాలయాల్లో మొక్కులు, కానుకలు సమర్పించుకుంటామని రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే కెసిఆర్ మొక్కుకున్నారు. ఆయన మొక్కుకున్నట్టే తెలంగాణ ఆవిర్భావంతోపాటు, తెరాస సర్కారే అధికారంలోకి రావడంతో తన మొక్కుల విషయాన్ని బయటపెట్టారు.

06/11/2016 - 04:07

జగదేవ్‌పూర్, జూన్ 10: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను వచ్చే శ్రావణ మాసంలో ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇళ్లను ప్రారంభించిన రోజే యాగం నిర్వహించి అత్యంత వేడుకగా గృహప్రవేశాలను నిర్వహిస్తామన్నారు.

06/11/2016 - 04:05

హైదరాబాద్, జూన్ 10: పేదరికం ఆమె పాలిట శాపమైంది. భర్త ఆకస్మిక మరణంతో రోడ్డున పడిన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం పరిచయస్తులను ఆశ్రయిస్తే ఏకంగా సౌదీ అరేబియాకు అమ్మేశారంటూ నగరానికి చెందిన బాధిత మహిళ కంట తడిపెట్టింది. సౌదీ అరేబియాలో కుట్టు, ఎంబ్రాయిడరీ, మెహందీ.. ఇలా ఇతర పనుల కోసం సౌదీ అరేబియా వెళ్లిన 18మంది మహిళలను అక్కడ షేక్‌ల వేధింపులకు గురి చేశారు.

06/11/2016 - 03:34

సూర్యాపేట, జూన్ 10: కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిజెపితోనే అభివృద్ధి తెలంగాణ సాధ్యమని తెలిపారు.

Pages