తెలంగాణ

యాగంతో గృహప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, జూన్ 10: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను వచ్చే శ్రావణ మాసంలో ప్రారంభిస్తామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇళ్లను ప్రారంభించిన రోజే యాగం నిర్వహించి అత్యంత వేడుకగా గృహప్రవేశాలను నిర్వహిస్తామన్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెండు దత్తత గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. డబుల్‌బెడ్ రూం ఇంటితో పాటు ప్రతి ఇంటికి 24 గంటలూ తాగునీరు అందిస్తామన్నారు. ఆగస్టు 4 తర్వాత మంచి ముహూర్తం ఉన్నందున గృహప్రవేశాలు నిర్వహించుకుందామన్నారు. వాడకో రకంగా మెరూన్, నీలం కలర్ పెయింటింగ్ వేసి సింగపూర్ మాదిరిగా ఎర్రవల్లి, నర్సన్నపేటలలోని ఇళ్లు ఒక పువ్వులాగా కనిపించాలని సూచించారు. ఇదిలావుండగా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గృహప్రవేశాలు చేసిన వెంటనే ప్రతి ఇంటికీ రిలయన్స్ కంపెనీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు అంగీకారం తెలిపిందన్నారు. ప్రతి ఇంటిపై హైదరాబాద్‌లో మాదిరిగా రెండు గ్రామాలలో నీటి ట్యాంకులు నిర్మించి 24 గంటలు తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్థిక ప్రగతి కోసం ప్రతి ఇంటికీ రెండు పాడి గేదెలు, 10 దేశవాళి కోళ్లను కూడా పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యంగా పాడి గేదెలకు వ్యవసాయ బావుల వద్దనే చిన్నపాటి పాకలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమష్టి వ్యవసాయంలో భాగంగా 8 వందల ఎకరాలలో సోయాబీన్, 2వేల ఎకరాలలో మొక్కజొన్న వేసుకొనేలా వ్యవసాయ శాస్తవ్రేత్తల ప్రణాళికలు తయారు చేసినందున, వారి సూచనల మేరకు సాగు జరగాలని సూచించారు. సోయాబీన్ ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నందున ఆర్థికంగా లాభపడవచ్చునని, సోయాబీన్‌కు రూ. 52 వందలు, మొక్కజొన్నకు రూ.14 వందలు మద్దతు ధరకు సీడ్ కంపెనీ వారు కొంటారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రాజెక్టులు పూర్తి కానున్నందున అప్పటి వరకు కూడేరు వాగు నుంచి మోటార్ల ద్వారా నీటిని తరలించి పాండురంగ, ఎర్రకుంట, నల్లకుంట, మైశిరెడ్డి కుంటలను నింపి డ్రిప్ ద్వారా పంటలకు నీరందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెసి వెంకటరాంరెడ్డి, జయశంకర్ వ్యవసాయ వర్శిటీ విసి ప్రవీణ్‌రావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా హన్మంతరావు, ఎంపిపి రేణుక, జెడ్పీటిసి రామచంద్రం, విడిసి అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్‌లు బాల్‌రెడ్డి, భాగ్యబాల్‌రాజు, ఎంపిటిసి భాగ్యమ్మ పాల్గొన్నారు.

చిత్రం... లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా నడిపి చూస్తున్న సిఎం కెసిఆర్