S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/10/2016 - 08:09

హైదరాబాద్, జూన్ 9: రుణమాఫీతో సంబంధం లేకుండా బ్యాంకర్లు పంట రుణాలు పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రుణమాఫీ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందని, దశల వారిగా దీనికి సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సచివాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశం నిర్వహించారు.

06/10/2016 - 08:08

హైదరాబాద్, జూన్ 9: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షను భగ్నం చేసి, ఆయన్ను అరెస్టు చేసిన ప్రభుత్వం, బేషరతుగా ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆలిండియా కాంపు సంఘం డిమాండ్ చేశారు. ముద్రగడ అరెస్టు నేపథ్యంలో సంఘం రాజధానిలో గురువారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

06/10/2016 - 08:07

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కూడా సమయానికి విధులకు హజరయ్యేలా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని ప్రభుత్వ దంత వైద్యశాల, కోఠిలోని మహిళా హాస్టల్‌లలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

06/09/2016 - 18:09

హైదరాబాద్: పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి ఎవరు పాల్పడినా క్షమించరాదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. సిఎల్‌పి నాయకుడు జానారెడ్డిని కోవర్టు అని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అనడం క్రమశిక్షణా రాహిత్యమేనని అన్నారు. పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇచ్చే విషయాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారని రవి చెప్పారు.

06/09/2016 - 18:08

హైదరాబాద్: నగరంలో నిఖిల్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎత్తు పెరగాలని అనవసర శస్తచ్రికిత్స చేసిన గ్లోబల్ ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఫిర్యాదు చేశారు. ఎత్తుపెరగాలని ఆరాటపడతున్న నిఖిల్‌రెడ్డి కాళ్లకు కొద్దిరోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు.

06/09/2016 - 17:02

హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపినందుకు తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదని పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ అన్నారు. మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడినందుకు సిఎం కెసిఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. కోదండరామ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.

06/09/2016 - 15:45

హైదరాబాద్: జంట నగరాల్లో జరిగే బోనాల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో బోనాలకు సన్నాహాలపై సమీక్షించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి పాల్గొన్నారు.

06/09/2016 - 15:45

మహబూబ్‌నగర్: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డుతగలడంతో కాసేపు ఉద్రిక్తత కొనసాగిన ఘటన కోస్గి మండలం బోగారంలో గురువారం జరిగింది. రహదారి పనుల ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో జూపల్లి మాట్లాడుతూ, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ప్రాజెక్టు ఆగదని పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించారు. దీంతో రేవంత్ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

06/09/2016 - 15:44

హైదరాబాద్: గిరిజన తండాలను పంచాయితీలుగా మారుస్తామని, వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెరాస అధినేత కెసిఆర్ గత రెండేళ్ల కాలంలో ఏమీ చేయలేదని మాజీ ఎంపి బలరాం నాయక్ అన్నారు. హామీల పేరుతో గిరిజనులు కెసిఆర్
దారుణంగా వంచించారని విమర్శించారు. పదవుల పంపిణీలో కూడా గిరిజనులకు ప్రాధాన్యం లేదన్నారు.

06/09/2016 - 15:44

హైదరాబాద్: గిట్టనివారెవరో చెరువులో విషం కలపడంతో భారీ సంఖ్యలో చేపలు మరణించిన ఘటన రాజేంద్రనగర్ మండలం మద్దిగుంట వద్ద గురువారం జరిగింది. లక్షలాది రూపాయలు వెచ్చించి స్థానిక మత్స్యకారులు చెరువులో చేపలు పెంచుతున్నారు. మృగశిర కార్తె రావడంతో చేపలకు డిమాండ్ పెరగడంతో వారు చేపలను బయటకు తీసేందుకు చెరువు వద్దకు వెళ్లారు.

Pages