S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/10/2016 - 18:15

వరంగల్: ఇక్కడి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఓ కాంట్రాక్టర్ నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సాంఘిక సంక్షేమశాఖ ఎఇ అజీజ్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. నిర్మాణం పనులకు సంబంధించి బిల్లులు పాస్ చేయించేందుకు అజీజ్ లంచం అడగుతూ వేధించడంతో ఆ కాంట్రాక్టర్ ఎసిబిని ఆశ్రయించాడు.

06/10/2016 - 17:54

హైదరాబాద్: తాను, తన కుటుంబం కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్నామని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి స్ఫష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

06/10/2016 - 17:41

హైదరాబాద్: ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్‌ను విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తాము వ్యితిరేకిస్తున్నామని, ఈ విషయమై ఈనెల 28, 29 తేదీల్లో ఎస్‌బిహెచ్ ఉద్యోగులు చేసే ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. ఎస్‌బిహెచ్ విలీనం యోచనను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిఎం కెసిఆర్ వెంటనే ప్రధానికి లేఖ రాయాలన్నారు.

06/10/2016 - 17:41

మెదక్: ఎర్రవల్లి గ్రామాన్ని సింగపూర్‌లా తయారుచేస్తానని సిఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎర్రవల్లిలో పర్యటించిన సందర్భంగా పలు వరాలు కురిపించారు. ఇక్కడ త్వరలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభిస్తామని, ప్రతి ఇంటికీ 2 పాడిగేదెలు, పది కోళ్లు, ఎల్‌ఇడి బల్బులు ఇస్తామన్నారు. పర్యటన సందర్భంగా 42 మందికి ట్రాక్టర్లను ఆయన పంపిణీ చేశారు.

06/10/2016 - 17:42

మెదక్: తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అన్ని సౌకర్యాలు ఈ రెండు గ్రామాల్లో కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

06/10/2016 - 16:29

హైదరాబాద్: బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నల్గొండ జిల్లా సూర్యాపేటకు బయల్దేరారు. అక్కడ జరిగే వికాస్ పర్వ్ సభలో అమిత్ షా పాల్గొంటారు.

06/10/2016 - 15:25

హైదరాబాద్ : రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల సరిహద్దుల్లో 12,500 ఎకరాల్లో ఫార్మాసిటీ ఫార్మాసిటీ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

06/10/2016 - 08:36

రెంటచింతల, జూన్ 9: గుంటూరు జిల్లా రెంటచింతల మండల పరిధిలోని సత్రశాల వద్ద ఉన్న ఏపీ జెన్‌కో టెయిల్‌పాండ్ ప్రాజెక్టును గురువారం తెలంగాణ రైతులు ముట్టడించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు ఆదిరామ్‌నాయక్, లాలూనాయక్ మాట్లాడుతూ ప్రాజెక్టునిల్వ నీటి కారణంగా తమ మంచినీటి ప్రాజెక్టులు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. దీని వల్ల ఏడువేల ఎకరాల్లో పంటసాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

06/10/2016 - 08:36

కొడంగల్, జూన్ 9: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలంలో గురువారం జరిగిన అభివృద్ధి పనుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరూ వ్యక్తిగత దూషణలు పాల్పడ్డారు. ఈ సంఘటన కోస్గి మండలంలోని బోదారం గ్రామంలో జరిగింది.

06/10/2016 - 08:35

నల్లగొండ, జూన్ 9: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలన్న బిజెపి లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో సైతం ఆ పార్టీ నాయకత్వం పలు వ్యూహాలను అమలు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బిజెపి విస్తరణకు ఆ పార్టీ ముందడుగు వేస్తోంది.

Pages