S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/13/2016 - 12:06

హైదరాబాద్: చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించి విద్యుత్ షాక్‌కు గురై తొమ్మిదేళ్ల బాలుడు మరణించిన సంఘటన రామంతాపూర్ వద్ద జరిగింది. సంక్రాంతి సెలవులు కావటంతో సూర్య రవికుమార్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం గాలిపటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డ రవికుమార్ చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మరణించాడు.

01/13/2016 - 12:05

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి, బిజెపి నేతలు బుధవారం ఉదయం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపారు. టిడిపి నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

01/13/2016 - 12:04

కరీంనగర్: బోయిన్‌పల్లి మండలం వరదవెల్లి వద్ద బుధవారం ఉదయం ఆటో బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనలో గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

01/13/2016 - 12:02

హైదరాబాద్: వికారాబాద్‌లోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో బుధవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దుకాణంలో సుమారు 15 లక్షల రూపాయల విలువచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

01/13/2016 - 08:28

సూర్యాపేట, జనవరి 12: ఆదాయమే లక్ష్యంగా..నష్టాల నుండి గట్టెక్కడమే ధ్యేయంగా టిఎస్‌ఆర్టీసి కొత్త మార్గాలను అనే్వషిస్తోంది. సంస్థ పరిధిలోని స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తోంది.

01/13/2016 - 08:11

హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం బ్రిక్స్ బ్యాంకు నుంచి 30వేల కోట్ల రూపాయల రుణానికి ప్రతిపాదనలు పంపించినట్టు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టియుడబ్లుజె) హెయుజె, టిఎస్‌పిజెఎ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌లో కెటిఆర్ మాట్లాడారు.

01/13/2016 - 08:14

హైదరాబాద్, జనవరి 12: ప్రతి మనిషి ఆత్మబలంతో ఎంతటి కార్యానైనా జయించవచ్చని, అదే ఆత్మబలంతో జ్యోతిష్యాన్ని అధిగమించవచ్చని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఉద్బోధించారు. యువశక్తిని అనుకూలంగా ఉపయోగించుకోవాలని, భారతదేశ జనాభాలో 60 శాతం యువత ఉందని, యువశక్తితో దేన్నయినా సాధించవచ్చని స్వామిజీ అన్నారు.

01/13/2016 - 06:53

ఎన్‌సిపి అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ మంగళవారం హైదరాబాద్‌లో సిఎం కె చంద్రశేఖర్ రావును కలిశారు. ఇరువురి మధ్యా చర్చలు జరిగినా సారాంశాన్ని గోప్యంగా ఉంచారు. తన నివాసానికి వచ్చిన పవార్‌కు మెమెంటో అందచేస్తున్న సిఎం కెసిఆర్

01/13/2016 - 06:51

హైదరాబాద్, జనవరి 12: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌తో ఆలింగనం చేసుకోవడం, తెలంగాణలో బిజెపి చంద్రబాబుతో ములాఖత్ కావడం ప్రజలను నిలువునా మోసం చేయడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కేంద్రంలో మోదీ, ఆంధ్ర సిఎం, తెలంగాణ సిఎంలను నమ్మవద్దని, వారి మాటలకు మోసపోవద్దని ప్రజలను కోరారు.

01/13/2016 - 06:43

హైదరాబాద్, జనవరి 12: మిషన్ భగీరథ పథకం భాగంగా తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేసే పనులు మెదక్ జిల్లాల్లో చురుకుగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు చెందిన మెదక్ జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మీదుగా వెళ్లనున్న పైపులైన్ కోసం మంగళవారం తవ్వకం పనులు ప్రారంభం అయ్యాయి. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం పైపులైన్లను వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు.

Pages