S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/31/2016 - 05:59

హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా సహ విద్యార్థులు శనివారం ఉద్యమించారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో నిర్వహించిన సామూహిక దీక్షలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ లోక్‌సభ స్పీకర్ పిఎ సంగ్మా సైతం పాల్గొన్నారు. విద్యార్ధులతో కలిసి వారికి సంఘీభావంగా ఇరువురు నేతలు కూర్చుని సామూహిక దీక్ష చేశారు.

01/30/2016 - 20:15

హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ అని, దానికోసమే 15 సంవత్సరాల సుదీర్ఘపోరాటం చేశామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని, ప్రచారహోరులో పడి కొట్టుకుపోవద్దని ఆయన సూచించారు.

01/30/2016 - 18:11

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల భావస్వేచ్ఛను కాలరాశారని, అందువల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఆరోపించారు. యూనివర్శిటీల్లో బిజెపి భావజాలం రుద్దే ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు. ఆనాడు గాంధీజీకి జరిగినట్లే ఇప్పుడు రోహిత్‌కు అవమానం జరిగిందని, అందుకే విద్యార్థులకు మద్దతుగా తాను దీక్షలో పాల్గొన్నానని ఆయన అన్నారు.

01/30/2016 - 15:21

నల్గొండ: సెల్‌ఫోన్ వాడొద్దని మేనమామ మందలించినందుకు తీవ్ర మనస్తాపానికి లోనై తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలం లింగవారిగూడెంలో శిరీష అనే బాలిక శనివారం ఆత్మహత్య చేసుకుంది. మేనమామ మందలించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

01/30/2016 - 11:58

హైదరాబాద్: ఎబివిపి పిలుపు మేరకు శనివారం తెలంగాణలో కళాశాలల్లో బంద్ జరుగుతోంది. హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనను కాంగ్రెస్ యువ నేత రాహుల్ రాజకీయం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణలో కళాశాలలన్నీ ఒకరోజు బంద్ పాటించాలని ఎబివిపి పిలుపునిచ్చింది.

01/30/2016 - 11:56

కరీంనగర్: కోతులు వెంటపడి తరుముతుండటంతో భయంతో పరుగులు తీసిన రైల్వే మాజీ ఉద్యోగి అమీరుద్దీన్ ఒక్కసారి గుండెపోటుకు లోనై ప్రాణాలు కోల్పోయాడు. రామగుండం రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కోతుల బెడద అధికం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

01/30/2016 - 11:56

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్ వద్ద జాతిపిత గాంధీజీకి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సి.ఎం. కెసిఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు శనివారం ఉదయం నివాళులర్పించారు. గాంధీ వర్థంతి సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

01/30/2016 - 11:55

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న నిరాహారదీక్షలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఉదయం పాల్గొన్నారు. రోహిత్ జయంతి సందర్భంగా విద్యార్థులు 18 గంటల సామూహిక నిరాహారదీక్షను ప్రారంభించారు. రాహుల్ రాకను ఎబివిపి విద్యార్థులు వ్యతిరేకించడంతో హెచ్‌సియులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

01/30/2016 - 11:54

నల్గొండ: సూర్యాపేట మండలం రాయనిగూడెం వద్ద శనివారం ఉదయం ఓ బైక్‌ను భారీ లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన జరిగినప్పుడు బైక్‌పై నలుగురు ప్రయాణిస్తున్నారు. మృతులలో సూర్యాపేటకు చెందిన మణికుమార్, కళ్యాణ్‌గా గుర్తించారు.

01/30/2016 - 11:54

హైదరాబాద్: రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు పిల్లలపైన, తమపైన కిరోసిన్ పోసుకొని దంపతులు నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Pages