తెలంగాణ

ప్రతి జిల్లాలో 20 మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: యాభై నుంచి 60 వేల జనాభాకో మండలం, 10 మండలాలకో రెవిన్యూ డివిజన్, రెండు డివిజన్లతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. జిల్లాలు, మండలాల పునర్విభజనపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న కలెక్టర్ల కసరత్తును సిఎం బుధవారం సమీక్షించారు. కొత్త జిల్లాలు కోరుతూ వచ్చిన ప్రతిపాదనలను సిఎం కెసిఆర్ జిల్లాలవారీ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో రెవిన్యూ డివిజన్ పరిధిలో 10నుంచి 12 మండలాలు ఉండాలని, ఒక్కో రెవిన్యూ డివిజన్ పరిధిలోకి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 5నుంచి 6 మండలాలు ఉండాలని సిఎం సూచించారు. రూరల్ మండలంలో 50నుంచి 60 వేల జనాభా, అర్బన్ మండలంలో లక్షన్నర వరకూ జనాభా ఉండేలా మండలాల పునర్విభజన జరగాలన్నారు.
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. బలవంతంగా తమను తీసుకెళ్లి ఇతర మండలంలో కలిపారన్న భావన ప్రజలకురాకుండా చూడాలన్నారు. మండలాల పునర్విభజన వల్ల జరుగుతున్న మార్పులపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు. పెద్ద మండలాలను రెండుగా విభజించాలని, ప్రజల అవసరాలు, సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్ర్తియంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు ఉండాలన్నారు. ‘దైవ కృపవల్ల అనుకున్న దానికంటే ఎక్కువగానే తెలంగాణ అభివృద్ధి సూచిక కనిపిస్తోంది. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్ అంచనా రెండు లక్షల కోట్లకు, తర్వాతి ఐదేళ్లకు నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుంది’ అని సిఎం అన్నారు. పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకునే పాలనా ఫలాలు ప్రజలందరికీ అందించడానికి, పరిపాలన ప్రజలకు మరింత చేరువకావడానికే జిల్లాలు, మండలాల పునర్విభజనకు పూనుకున్నామని సిఎం వివరించారు.

చిత్రం... కొత్త జిల్లాలపై కలెక్టర్లతో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్