తెలంగాణ

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8 : తెలంగాణలో పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామారావు కోరారు. వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న 40 మంది సక్సెస్‌ఫుల్ తెలంగాణ ఎన్నారైలతో బుధవారం ఆయన సిలికాన్ వ్యాలీలోని ఒక తెలంగాణ ఎన్నారై కంపెనీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ఎన్‌ఆర్‌ఐలను ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ ఎన్నారైలను భాగస్వాములను చేయాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, టిహబ్, ఐటి పాలసీల గురించి మంత్రి వవరించారు. సిలికాన్ వ్యాలీలో టిహబ్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలపగా, ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నారైల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలంగాణ ఎన్నారైలు హామీ ఇచ్చారు.